Chandrababu Naidu: నేను అసెంబ్లీకి పోవాలంటే.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే టీడీపీకి అధికారాన్ని ఇవ్వాలి.. ప్రజలను కోరిన చంద్రబాబు
నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం 40ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీకి పోతే అవమానించారు. చివరికి నా భార్యను కూడా అవమానించారు. నేను ఆరోజు ఒక నిర్ణయం చేసుకున్న ఇది గౌరవ సభకాదు కౌరవ సభ అని. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీలో గౌరవ సభ పెట్టి అప్పుడు ఎటరవుతా, లేకపోతే అసెంబ్లీకి రానని ఆరోజే చెప్పా. నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో గెలిపిస్తే తప్ప నేను చేయలేను. ఇదే చివరి ఎన్నిక అవుతుంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
Chandrababu Naidu: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి పత్తికొండలో జరిగిన సభలో చంద్రబాబు భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. ఒకపక్క జగన్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత.. నన్ను, నా సతీమణిని కూడా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం 40ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీకి పోతే అవమానించారు. చివరికి నా భార్యను కూడా అవమానించారు. నేను ఆరోజు ఒక నిర్ణయం చేసుకున్న ఇది గౌరవ సభకాదు కౌరవ సభ అని. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీలో గౌరవ సభ పెట్టి అప్పుడు ఎటరవుతా, లేకపోతే అసెంబ్లీకి రానని ఆరోజే చెప్పా. నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో గెలిపిస్తే తప్ప నేను చేయలేను. ఇదే చివరి ఎన్నిక అవుతుంది అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Last Elections : ఇదే నా చివరి ఎన్నిక-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కడపలో స్టీల్ ప్లాంట్ కట్టలేని జగన్ మూడు రాజధానులు కడతానంటూ చెబుతున్నాడు. జగన్ వచ్చిన తరువాత ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. నేను ఉంటే స్టీల్ ప్లాంట్ వచ్చేదని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. అప్పుడు చేసిన అభివృద్ధే ఇప్పుడు హైదరాబాద్ ఆదాయం చూపిస్తుంది. మొన్న ప్రధాని మోదీ వచ్చినప్పుడు బీజేపీ నేతలు డ్వాక్రా గ్రూపుల గురించి చెప్పారు. రాష్ట్ర విడిపోయినప్పడు అభివృద్ధి కోసం కృషి చేశాను. జగన్ ఒక్కసారి ఛాన్సు అని రాష్ట్రం రివర్స్ గేరులో తీసుకెళ్తున్నాడు. జగన్ ఇచ్చేది గోరంత దోచేది కొండంత. ప్రతిదానికీ పన్ను వేస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. జగన్ రెడ్డి మీ నాన్నను చూసా, మీ తాత ను చూసా, నేను ఎవరికి బయపడనంటూ చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో భూ బకాసురుడుని, నరరూప రాక్షసురుడిని కట్టడి చేయాలి, లేకుంటే ఎవరిని వదలడు అంటూ చంద్రబాబు ప్రజలకు సూచించారు.
Chandrababu On CM Jagan : రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలి-చంద్రబాబు
నేను ధర్మంకోసం పోరాటం చేస్తున్న. నా ప్రాణం ముఖ్యం కాదు, రాష్ట్రం, ప్రజలు ముఖ్యం. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా. ప్రతిపక్ష నేతపైన దాడి చేయిస్తున్నారు. నేను చేయాలనుకుంటే మీ ఇళ్లపై రోడ్డు రోలర్‌తో తొక్కించేవాడిని అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్న బాణం చెల్లెలిని చూడలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి చూస్తాడు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పత్తికొండలో టమోటా ధరలు పడిపోతున్నాయి. జగన్ రైతులను ఏనాడైనా పరామర్శించరా? ధరల స్థిరీకరణ ద్వారా ఉల్లి, టమోటాకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. పత్తికొండలో అవినీతి తారాస్థాయికి చేరిందన్న చంద్రబాబు.. అవినీతి పరుల అంతం చేయడానికి అందరూ పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.