Chandrababu : జగన్ ఉన్నంత వరకు రాష్ట్రం అభివృద్ధి చెందదు : చంద్రబాబు
నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్ టార్గెట్ గా చంద్రబాబు రెచ్చిపోయారు. అభివృద్ధి విధ్వంసకుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు.

Chandrababu (1)
Chandrababu : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ అనే సైతాన్ ఉన్నంత వరకు రాష్ట్రం అభివృద్ధి చెందని విమర్శించారు. ఏపీలో సైకో పోవాలి..సైకిల్ రావాలి.. అదే ప్రజల నాడి కావాలి.. అని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతవరకు రాష్ట్రం బాగుపడదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి అరాచకాలకు చరమ గీతం పాడే సమయం దగ్గర్లలోనే ఉందని పేర్కొన్నారు. ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించారు.
నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్ టార్గెట్ గా చంద్రబాబు రెచ్చిపోయారు. అభివృద్ధి విధ్వంసకుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను బాధిస్తున్నారని ఒక్క అవకాశానికి మోస పోయి ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో దొంగల ముఠా పడిందన్నారు. దోపిడీ ముఠా దోచుకుంటున్నారని విమర్శించారు.
వైసీపీ నేతలు దొంగల ముఠాలుగా మారి ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జగన్ మోహర్ రెడ్డికి డేట్ దగ్గర పడిందన్నారు. మరో 5 నెలలు మాత్రమే అతడి పాలన ఉంటుందని చెప్పారు. అయితే చంద్రబాబు సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డ్రోన్ తో వీడియో చిత్రీకరణ చేసేందుకు వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు.
డ్రోన్ తో వీడియోలు తీయొద్దని.. ఒక వేళ వీడియోలు తీస్తే అరెస్టు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. డ్రోన్ చిత్రీకరణకు అనుమతి తీసుకున్నామని చెప్పినా వినలేదు. చంద్రబాబు పర్యటన సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగోలను వద్ద వైసీపీకి చెందిన కొందరు దాడికి దిగటం కలకలం రేపింది. గుడివాడ నుంచి హన్ మాన్ జంక్షన్ వస్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
అదే గ్రామానికి చెందిన రేమళ్లే రాజు అనే వైసీపీ కార్యకర్త తమ పార్టీ జెండాతో చంద్రబాబు వాహన శ్రేణికి ఎదురెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తులు మద్దాల వెంకటేశ్వర్ రావుతోపాటు మరికొందరు అతన్ని వారించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గురివింద గుంట రాజు అనే వైసీపీ కార్యకర్త వారిపై దాడి చేయగా వెంకటేశ్వర్ రావు తలకు తీవ్ర గాయమైంది. అక్కడికి చేరుకున్న చంద్రబాబు.. విషయం తెలుసుకుని దాడి చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.