పచ్చని కోనసీమలో చిచ్చు పెడుతున్నారు- చంద్రబాబు నిప్పులు
ఈ ఊరిలో చెత్త పక్క ఊరిలో బంగారం అవుతుందా? నాసిరకం మద్యంతో 30వేల మంది చనిపోయారు.

Chandrababu Slams CM Jagan
Chandrababu Naidu : వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పచ్చని కోనసీమలో చిచ్చు పెడుతున్నారు అని ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో ఆనందానికి అడ్రస్ లేకుండా పోయిందని చంద్రబాబు వాపోయారు. దగాపడ్డ ఆంధ్ర ప్రజల కోసం రాష్ట్రమంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. రైతులు అతలాకుతలం అవుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తయి ఉంటే ఉభయగోదావరిలో 3 పంటలకు నీళ్ళు ఇచే వాళ్ళమన్నారు.
Also Read : సీఎం జగన్ ఊహించని ట్విస్టులు.. ఎమ్మెల్యేలలో జాబితా గుబులు
‘అధికారంలోకి రాగానే రౌడీయిజానికి బ్రేకులు వేస్తాను. విద్యుత్ బిల్లులు జోన్ సిస్టమ్ తో దోచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.1.50కే కరెంట్ ఇస్తాము. సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు పెడతాం. నాసిరకం మద్యంతో 30వేల మంది చనిపోయారు. కేవలం ఒక వ్యక్తి ధన దాహమే ఇందుకు కారణం. బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి రక్షణ చట్టం తెస్తా. సమాజహితం కోసం ఉపయోగించాల్సిన ఇసుక సంపదను దోచేస్తున్నారు. కార్పొరేషన్లు పెట్టినా పైసా విదల్చని ప్రభుత్వం ఇది. ఈ ఊరిలో చెత్త పక్క ఊరిలో బంగారం అవుతుందా?’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ట్రాన్సఫర్స్ పై చంద్రబాబు మండిపడ్డారు.
Also Read : అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే?
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మండపేట వైసీపీ ఇంఛార్జి తెలివైన వాడు. అధికారం పంచన చేరతాడు. అలాంటి వారిని ఈసారి దరి చేరనివ్వం. గ్రావెల్, ఇసుకలో 500 కోట్లు కొట్టేశాడు’ అని ఆరోపణలు చేశారు చంద్రబాబు.