BJP-TDP Alliance: బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా?
బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా అనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై 10టీవీ Big Bang ప్రోగ్రాంలో ప్రొపెసర్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక విశ్లేషణ చేశారు.

BJP-TDP-Janasean Alliance
AP Politics : ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ- జనసేన కూటమిలో చేరేందుకు బీజేపీసైతం అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈమేరకు గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది. అయితే, సీట్లసర్దుబాటు విషయంలో క్లారిటీ రాకపోవటంతో మళ్లీ ఇవాళ అమిత్ షా, బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. గురువారం రాత్రి జరిగిన చర్చల్లో బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాలు కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి ఆరు స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. బీజేపీకి నాలుగు లోక్ సభ, ఆరు అసెంబ్లీ సీట్లను చంద్రబాబు ఆఫర్ చేయగా.. ఆరు పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ పెద్దలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
టీడీపీ ఇస్తామంటున్న నాలుగు లోక్ సభ స్థానాల్లో రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అడుగుతున్న ఆరు లోక్ సభ స్థానాల్లో రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, అరకు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ స్థానాలలో కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక స్థానం ఇస్తామని చంద్రబాబు బీజేపీ పెద్దలకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, 2014లో తాము పోటీచేసిన స్థానాలు తమకే ఇవ్వాలని బీజేపీ కోరుతుందట. ఇవాళ మళ్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ భేటీ కానున్న నేపథ్యంలో సీట్ల సర్ధుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై పూర్తిక్లారిటీ వచ్చిన తరువాత ఎన్డీయేలోకి టీడీపీ చేరిక ఉంటుందని సమాచారం.
Also Read : Chandrababu Naidu : క్లైమాక్స్‌లో పొత్తు..! ఢిల్లీకి చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం
ఇదిలాఉంటే.. బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా అనేఅంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయంపై 10టీవీ Big Bang ప్రోగ్రాంలో ప్రొపెసర్ కె. నాగేశ్వరరావు పాల్గొని కీలక విశ్లేషణ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు క్రింది వీడియోలో చూడొచ్చు..