Kesineni Chinni : ఎంపీ కేశినేని నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కేశినేని చిన్ని

కొంతమంది నా వల్లనే గద్దె రామ్మోహన్ రావు భారీ మెజార్టీతో గెలిచాడని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు.. గద్దె రామ్మోహన్ రావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతను రాజకీయాల్లో ఉన్నాడోలేడో ప్రచారం చేసుకునేవారు ఒకసారి గుర్తు చేసుకోవాలని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.

Kesineni Chinni : ఎంపీ కేశినేని నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కేశినేని చిన్ని

Kesineni Chinni

Updated On : February 4, 2024 / 1:38 PM IST

TDP Leader Kesineni Chinni : టీడీపీ వీడి ఇటీవల వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్నిసంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని పాల్గొని మాట్లాడారు.. తెలుగుదేశం పార్టీ మారిన కొంతమంది వచ్చి మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త అంటూ స్థానికులను చిన్ని సూచించారు. ప్రతిపక్షంలో ఉండికూడా గద్దె రామ్మోహన్ రావు 20వేల ఓట్ల మెజార్టీతో విజయవాడ తూర్పులో విజయకేతనం ఎగరవేశారు. ఎప్పుడూ ప్రజలతోనే గద్దె రామ్మోహన్ రావు ఉంటాడు. కాబట్టి అంత మెజార్టీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా రామ్మోహన్ రావుని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నానని చిన్ని అన్నారు.

Also Read : Chiranjeevi : నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

కొంతమంది నా వల్లనే గద్దె రామ్మోహన్ రావు భారీ మెజార్టీతో గెలిచాడని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గద్దె రామ్మోహన్ రావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతను రాజకీయాల్లో ఉన్నాడోలేడో ప్రచారం చేసుకునేవారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. గన్నవరం ఇండిపెండెంట్ గా, ఎంపీగా గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు. కొంత మంది ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారం చేసుకొని అధికారం చేపట్టిన సమయంలోనూ గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు.. అది ఆయన సత్తా.. అంటూ కేశినేని చిన్ని అన్నారు. గతంలో ఓ వ్యక్తి ఎంపీగా గెలిచాడు.. అంటే దానికి కారణం గద్దె రామ్మోహన్ రావేనని కేశినేని చిన్ని అన్నారు. రామ్మోహన్ నియోజకవర్గంలోనే ఆ ఎంపీకి భారీ మెజార్టీ వచ్చింది. పార్టీ మారి గొప్పలు చెప్పుకుంటున్న ఆ ఎంపీని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలంటూ స్థానికులకు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.

Also Read : Kinjarapu Atchannaidu: కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ.. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు.. దాదాపు 25వేల కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క కుట్టు మిషన్ కూడా పంపిణీ చేయకపోవటం దారుణం. అధికారంలో లేకపోయినా ప్రజలు ఇబ్బందులను తెలుసుకొని సొంత నిధులతో ప్రజలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని, మేము చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి మీరు ఓటు వేయాలని కేశినేని చిన్ని కోరారు. కరోనా సమయంలోకూడా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.. మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన ఏపీని డెవలప్మెంట్ చేస్తారని కేశినేని చిన్ని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశం ఉందని ప్రజలకోసం పోరాటం చేస్తున్నారు. ఆయన ఎంతో విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులుచూసి టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకున్నాం. మన రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటివారు ముఖ్యమంత్రి కావాలని కేశినేని చిన్ని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు వివరించాలి.. జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుని మనం అధికారం చేపట్టాలని కేశినేని చిన్ని పేర్కొన్నారు.