24గంటల్లో వైఎస్ జగన్ స్పందించాలి.. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలన్నీ వెలుగుచూస్తాయి : ఎంపీ కేశినేని చిన్ని

బురద రాజకీయాల జోలికి నేను వెళ్లను. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు.

24గంటల్లో వైఎస్ జగన్ స్పందించాలి.. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలన్నీ వెలుగుచూస్తాయి : ఎంపీ కేశినేని చిన్ని

Kesineni Chinni

Updated On : May 8, 2025 / 12:53 PM IST

Kesineni Chinni: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి దగ్గర పాలేరుగా చేసిన నాని అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే.. ఆయనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబధాలు ఉన్నాయని తెలిసి అతనితో ఉన్న వ్యాపార లావాదేవీలు వదులకున్నాను. నేను నిఖార్సైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిని అంటూ చిన్ని చెప్పారు.

Also Read: ఏపీలో పాకిస్థాన్ కాలనీ.. ఇప్పుడు పేరు మార్చి భగీరథ కాలనీ అయింది.. దాని విశేషాలు..

మాజీ ఎంపీ కేశినేని నాని మద్యం కుంభకోణం వ్యక్తులతో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ స్కాంను డైవర్ట్ చేసేందుకు ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారైనా లిక్కర్, ఇసుక మాఫియాపై కేశినేని నాని ప్రశ్నించాడా..? అంటూ కేశినేని చిన్ని ఫైర్ అయ్యాడు. బురద రాజకీయాల జోలికి నేను వెళ్లను. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు. జగన్ రెడ్డి గుర్తుంచుకో.. విజయసాయిరెడ్డి చెప్పాడు. లిక్కర్ స్కాం జరిగిందన్నది వాస్తవం. జగన్ తాడేపల్లి కార్యాలయంలోని రూమ్ నెంబర్ నాలుగులోనే లిక్కర్ స్కాం వ్యూహం అంతా నడిచింది. లిక్కర్ స్కాం పై సీబీఐ విచారణ జరిపేందుకు ఫిర్యాదు చేశాను. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయని కేశినేని చిన్ని అన్నారు.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు బహవల్‌పూర్ ఉగ్రవాద స్థావరం ఎలా మారిందో చూడండి.. వీడియో వైరల్

మద్యం స్కాంపై సీబీఐ విచారణ చేయాలి. 3600 కోట్ల రూపాయల మద్యం స్కాంలో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. సంబంధం లేని కంపెనీలు తన పేరిట ఉన్నాయని దుష్ర్పచారం చేస్తున్నారు. వీటన్నింటిపైన సీబీఐ విచారణ చేయాలని లేఖ రాశాను. దీనిపై 24 గంటల్లోగా వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కేశినేని చిన్ని డిమాండ్ చేశారు.