Vijayasai Reddy V : టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే, అధికారంలోకి రావడం కలే, 25ఎంపీ స్థానాలు మావే- విజయసాయిరెడ్డి

ఏపీ అభివృద్ధి నిరోధకులు చంద్రబాబు, లోకేశ్. సులభ్ కాంప్లెక్స్ వ్యాపారం చేసుకోవచ్చు. Vijayasai Reddy V - TDP

Vijayasai Reddy V : టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే, అధికారంలోకి రావడం కలే, 25ఎంపీ స్థానాలు మావే- విజయసాయిరెడ్డి

Vijayasai Reddy V (Photo : Google)

Updated On : August 24, 2023 / 9:06 PM IST

Vijayasai Reddy V – TDP : టీడీపీలో ఉన్న వారందరూ సంఘ విద్రోహ శక్తులే అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కలే అన్నారాయన. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 25 ఎంపీ స్థానాలు వస్తాయని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు ఎంపీ విజయసాయిరెడ్డి. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా సమావేశాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం అని, వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలని చెప్పారు.

Also Read..Kodali Nani : ఎన్టీఆర్ అసలైన వారసులు వస్తారు, తండ్రీ కొడుకులను తరిమేస్తారు- చంద్రబాబు, లోకేశ్‌లపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

సమీక్షా సమావేశం సందర్భంగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. ”టీడీపీ అర్థరహితమైన విమర్శలు చేస్తోంది. చంద్రయాన్ స్పీడ్ తో చంద్రబాబు వెళుతున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తోంది. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్లుగా చంద్రయాన్ విజయంపై టీడీపీ ఆర్భాటం చేస్తోంది. 2024లో 24 నుంచి 25 లోక్ సభ స్థానాలు వైసీపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాషాయంలో ఉన్న ఎల్లో బ్యాచ్ కి, టీడీపీ రెడ్ లో ఉండటంతో నిద్ర పట్టడం లేదు. వైసీపీ డీబీటీని నమ్మింది. జీటీపీ అంటే గెలిస్తే తంతాం. టీడీపీ పేరు జీటీపీగా మార్చుకోండి.

గెలిస్తే తంతాం, బట్టలూడదీస్తాం అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు చంద్రబాబు, లోకేశ్. ఏపీ అభివృద్ధి నిరోధకులు చంద్రబాబు, లోకేశ్. టీడీపీ అధికారంలోకి రావటం కల్ల. ముఖ్యమంత్రినే అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. అయ్యన్నపాత్రుడు కాదు అరగుండు పాత్రుడు ఏదో మాట్లాడుతున్నాడు.

Also Read..Nara Lokesh : నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా- నిప్పులు చెరిగిన నారా లోకేశ్

చిలుకలూరిపేట సమావేశం జరిగినప్పుడు ముగ్గురిమే ఉన్నాం. మేము ఏం మాట్లాడుకున్నామన్నది ఏదో ఊహించుకుని రాయటం తప్పు. పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నాం. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమర్థవంతంగా పని చేస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా. సోమవారం ఎన్నికల చీఫ్ అధికారిని చంద్రబాబు కలవబోతున్నారు. ఆయన వాదన ఆయన వినిపిస్తారు. మా వాదన మేము వినిపిస్తాం. ఏం జరుగుతుందో తెలుస్తుంది.

టీడీపీకి క్రెడిబులిటీ లేదు. విజన్ 2047 చంద్రబాబుది కాదు. నీతి ఆయోగ్ ది. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నాడు. చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ గెలిచింది. లోకేశ్, చంద్రబాబు సులభ్ కాంప్లెక్స్ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజల డబ్బుతో కట్టిన రిషికొండలో భవనాలను ఎందుకు కూలుస్తారు? ” అని ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి.

Also Read.. Mylavaram: మళ్లీ హీటెక్కిన మైలవరం రాజకీయం.. వైసీపీకి తప్పని తలనొప్పులు