Time Slot Tokens : తిరుపతి స్వామి దర్శనానికి వెళ్తున్నారా?.. వారికి మాత్రమే కొండపైకి అనుమతి

దేశంతో పాటు ఏపీలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఏపీలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అప్రమత్తమైంది.

Time Slot Tokens : తిరుపతి స్వామి దర్శనానికి వెళ్తున్నారా?.. వారికి మాత్రమే కొండపైకి అనుమతి

Time Slot Tokens

Updated On : March 30, 2021 / 8:26 PM IST

Tirumala Time Slot Tokens : దేశంతో పాటు ఏపీలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఏపీలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో మరోసారి తిరుమల కొండపైకి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది. దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని తెలిపింది.

ఇక టైంస్లాట్ దర్శన టోకెన్లు పొంది రోడ్డు మార్గంలో వచ్చే భక్తులను అలిపిరి చెక్ పాయింట్ వద్ద ముందురోజు మధ్యాహ్నం 1 గంట నుండి మాత్రమే అనుమతిస్తామంది. టైంస్లాట్ దర్శన టోకెన్లు గల నడకదారి భక్తులను అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల్లో ముందురోజు ఉదయం 9 గంటల నుండి మాత్రమే అనుమతించనుంది.