Onlineలో లడ్డూలు : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా TTD పాలకమండలి మీటింగ్

TTD పాలకమండలి కీలక సమావేశం జరుగుతోంది. 2020, మే 28వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఛైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతనలో జరుగుతున్న ఈ సమావేశానికి టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ మరికొంత మంది సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒక్క సారి సమావేశం నిర్వహించాల్సి ఉండడంతో… లాక్‌డౌన్ ఉన్నప్పటికీ పాలకమండలి సమావేశం కాబోతోంది.
అయితే… చరిత్రలో మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది టీటీడీ. ఈ సమావేశంలో 60 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా స్వామివారి ఆస్తుల విక్రయాలపై టీటీడీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. మరోవైపు… ప్రభుత్వం అనుమతిస్తే భక్తుల దర్శనాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైనా ఫోకస్ పెట్టనుంది.
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకోనుంది. పారిశుధ్య పనులు, అతిథి గృహా నిర్వాహణకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. అయితే.. స్వామివారి ఆస్తుల వేలంపై పొలిటికల్ వార్ నడుస్తుండటంతో గురువారం జరిగే భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. కరోనా వైరస్ కారణంగా గత 60 రోజులుగా తిరుపతిలో దర్శనాలను నిలిపివేశారు.
మరోవైపు…తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన లడ్డూలను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనూ అమ్మనున్నారు. ఆన్‌లైన్‌లో లడ్డూలను ఆర్డర్ చేసినవాళ్లు.. వాటిని తమ సమీప టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాల్లో సేకరించే అవకాశం కల్పించారు. లాక్‌డౌన్ వల్ల తిరుమల ఆలయాన్ని మూసివేయడంతో శ్రీవారి ప్రసాదాల అమ్మకాలు కూడా ఆగిపోయాయి. అయితే ఈమధ్యే లడ్డూ ప్రసాద విక్రయాలు ఏపీలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అన్ని జిల్లాలోనూ లడ్డూలను విక్రయిస్తుండగా… తాజాగా.. ఆన్‌లౌన్ అమ్మకాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు టీటీడీ అధికారులు.
Read: తిరుమలపై రాజకీయాలొద్దు… వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు…తేల్చిచెప్పిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి