Andhra Pradesh : మోకాళ్ల నొప్పులకు ఇంజెక్షన్ చేసిన RMP డాక్టర్ .. ఇద్దరు మృతి, మరో ముగ్గురు పరిస్థితి విషమం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Andhra Pradesh : మోకాళ్ల నొప్పులకు ఇంజెక్షన్ చేసిన RMP డాక్టర్ .. ఇద్దరు మృతి, మరో ముగ్గురు పరిస్థితి విషమం

two died,3 others in critical situation in sri sathyasai district due to rmp medical malpractice

Updated On : December 10, 2022 / 11:15 AM IST

Andhra Pradesh : ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడీసీ మండలం కుంట్లపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లగా సదరు డాక్టర్ వారికి ఓ ఇంజక్షన్ ఇవ్వగా రెండు రోజులకు నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆతరువాత ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా మారటంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించటంతో పదుల సంఖ్యలో బాధితులు అనారోగ్యానికి గురి కాగా వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది.