Union Minister Kaushal Kishore: దేశ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళ.. ఆ విషయంలో ప్రధాని మోదీ‌ నిబద్ధతను తెలియజేస్తుంది ..

రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం విధితమే. అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రత్యేక సమావేశాలతో కేంద్ర మంత్రులు నియామక పత్రాలను అందజేస్తున్నారు. 

Union Minister Kaushal Kishore: దేశ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళ.. ఆ విషయంలో ప్రధాని మోదీ‌ నిబద్ధతను తెలియజేస్తుంది ..

Union Minister Kaushal Kishore

Updated On : May 16, 2023 / 11:34 AM IST

Rozgar Mela 2023: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రోజ్‌గార్ మేళా కింద ఎంపికైన ఉద్యోగస్తులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం విజయవాడలో జరిగింది. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన ఐదవ రోజ్ గార్ మేళా కార్యక్రమంకు ముఖ్య అతిధిగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్, రైల్వే ఉన్నతాధికారులుకూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ ‌విభాగాల్లో 300మందికి ఉద్యోగాలు రాగా, వీరందరికీ నియామక పత్రాలను కేంద్ర మంత్రి అందజేశారు.

Karnataka CM post: కర్ణాటక సీఎం ఎవరు..? ఢిల్లీకి వెళ్లే ముందు శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. సిద్ధ రామయ్యకు లైన్ క్లియర్ అయినట్లేనా?

రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం విధితమే. అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రత్యేక సమావేశాలతో కేంద్ర మంత్రులు నియామక పత్రాలను అందజేస్తున్నారు.  ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ.. రాజకీయ, వాణిజ్య రాజధాని విజయవాడ‌కు తొలిసారిగా రావడం ఆనందంగా ఉందని అన్నారు. రోజ్ గార్ మేళా‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన సుమారు 71,000 మంది యువతకు ఆన్‌లైన్ ద్వారా నియామక పత్రాలు ఇచ్చారని అన్నారు. నేను ఇక్కడ 300మందికి నియామక పత్రాలు అందజేశానని అన్నారు.

Bopparaju Venkateshwarlu : ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు : బొప్పరాజు వెంకటేశ్వర్లు

రోజ్ గార్ మేళ దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా పది లక్షల‌ మందికి కొత్తగా అవకాశం కల్పించడం గొప్ప‌ విషయం అని చెప్పారు. రోజ్ గార్ మేళాతో ఉపాధి కల్పనకు ఉన్నత ప్రాధాన్యతను ఇవ్వాలనే మన ప్రధానమంత్రి మోదీ నిబద్ధతను తెలియ చేస్తుందని కొనియాడారు. భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకు ఈ ఉద్యోగ మేళా ఆదర్శ కార్యక్రమంగా నిలుస్తుందని చెప్పారు.

Sudha Murthy : నేను యూకే ప్రధాని అత్తగారినంటే నమ్మలేదు ‘జోక్‌ చేస్తున్నారా? అన్నారు : సుధామూర్తి

దేశాభివృద్ధిలో యువత భాగస్వాములవడానికి ఇదొక మంచి అవకాశం అని కేంద్ర మంత్రి అన్నారు. విభిన్న ప్రభుత్వ విభాగాలలో కొత్తగా నియమితులైన వారు, ఆన్‌లైన్ ఓరియెంటేషన్ కోర్సు కర్మయోగి ప్రారంభ్ ద్వారా శిక్షణ తీసుకుంటారు.