Vijayasai Reddy : సీబీఐ కోర్టులో విజయసాయి రెడ్డి పిటిషన్.. అసలు రీజన్ ఇదే..!

Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుచూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Vijayasai Reddy : సీబీఐ కోర్టులో విజయసాయి రెడ్డి పిటిషన్.. అసలు రీజన్ ఇదే..!

Vijayasai Reddy

Updated On : January 24, 2025 / 10:24 PM IST

Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. సోషల్ మీడియా వేదికగా తన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుచూ విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు విజయసాయి సీబీఐ కోర్టు అనుమతిని కోరారు. సీబీఐ స్పందన కోసం విచారణ ఈ నెల 27కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

రాజకీయాలకు దూరంగా భవిష్యత్తులో తాను వ్యవసాయం మాత్రమే చేస్తానంటూ విజయసాయి ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు, ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన విజయ సాయి శనివారం(జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోయేది లేదని స్పష్టం చేశారు. తనకు పదవులు, ప్రయోజనాలు అవసరం లేదన్నారు. ఏదో డబ్బు ఆశించి తాను రాజీనామా చేయడం లేదన్న ఆయన తన నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని పేర్కొన్నారు.

Read Also : Vijay Sai Reddy : రాజకీయాలకు గుడ్‌బై.. కొత్త వృత్తిలోకి విజయసాయిరెడ్డి.. అధికారిక ప్రకటన!