దారితప్పిన లాయర్.. తాళి కట్టిన భార్యను వదిలేసి డ్రైవర్ భార్యతో కాపురం, పుట్టింటికి వెళ్లి వచ్చేలోగా..

wife caught husband: పెళ్లి చేసుకున్నాడు..పెళ్లైన కొద్ది రోజులకే అతడికి భార్య బోరు కొట్టింది. ఇల్లాల్ని వదిలేసి.. ప్రియురాలితో కాపురం పెట్టాడు. అంతటితో ఆగకుండా మరికొందరి మహిళలతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. న్యాయవాద వృత్తిలో ఉంటూ మోసాల బాట పట్టాడు.
అతడో లాయర్.. అతడి భార్య కూడా లాయరే.. అతడి పని..ప్రజలకు న్యాయం జరిగేలా చూడటం.. కానీ ఈ లాయర్..భార్యకే అన్యాయం చేశాడు.. తాళి కట్టిన భార్యను వదిలేసి..డ్రైవర్ భార్యతో కాపురం పెట్టాడు..
అంతేకాదండోయ్..మరికొందరితోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు..? రాసలీలల లాయర్‌పై కాల్‌మనీ కేసులు కూడా ఉన్నాయట..?
గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి పంపాడు, ఆ తర్వాత వదిలించుకునే ప్రయత్నం:
చంద్రమౌళి చిత్తూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇతడికి కవితతో 2005లో పెళ్లైంది. ఈమె కూడా లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్నాళ్లు కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఏమైందో మరి.. గర్భవతిగా ఉన్న భార్యను పుట్టింటికి పంపించేశాడు. ఆ తర్వాత నువ్వు అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇదేంటని అడిగితే ఏదో కారణం చెప్పి.. వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో భర్తపై కేసు పెట్టింది కవిత. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. సీన్‌కట్ చేస్తే…భర్త ప్రియురాలితో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది కవిత. మరి ఆ ప్రియురాలు ఎవరు..? భార్యను దూరం పెట్టి ఇన్నాళ్లు..అతడు ఎక్కడికి వెళ్లాడు..? అసలేం జరిగిందో…ఆమె మాటల్లోనే విందాం.
పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు.?
తనను దూరం పెట్టాక.. తన భర్త అనేకమంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని…అతడి భార్య కవిత చెబుతున్న మాట. ఒక్కో పేరుతో ఒక్కో ఊరిలో చెలామణి అయ్యే వాడట. అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ…కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరించేవాడని తెలిపింది.
డ్రైవర్ భార్యతో కాపురం, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అసలు భార్య:
అయితే తనను ఎందుకు దూరం పెడుతున్నాడనే అనుమానంతో కవిత…తన భర్త చంద్రమౌళిపై ఓ కన్నేసి ఉంచింది. చివరకు కారణమేంటో తెలుసుకుంది. తిరుపతి పద్మావతి నగర్‌లో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని.. డ్రైవర్ భార్యతో కాపురం పెట్టినట్లు కనిపెట్టింది. తన భర్తను ప్రియురాలితో సహా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్కెచ్ వేసింది. అందుకోసం కాపు కాసింది. ఇద్దరు ఇంట్లో ఉండగా వెళ్లి డోర్ తట్టింది. కవితను చూసిన సదరు మహిళ వెంటనే డోర్ పెట్టేసింది. ఆ విషయాన్ని చంద్రమౌళికి చెప్పింది. భార్య వచ్చిందన్న విషయం తెలుసుకున్న అతగాడు..ప్రియురాలి సాయంతో ఇంటి వెనుక కిటీకి నుంచి చీర సాయంతో ఉడాయించాడు.
https://10tv.in/husband-harassment-on-wife-for-extra-dowry-wife-protest-in-front-of-house-anantapur-district/
లాయర్ పై వివాహేతర సంబంధాలు, కాల్‌మనీ కేసులు
చంద్రమౌళి వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ వచ్చి డోర్ తీసింది. ఆ ఇంట్లోకి వెళ్లిన కవిత…అక్కడి వస్తువులను చూసి షాక్‌కు గురైంది. చంద్రమౌళి మొబైల్స్‌తో పాటు దాదాపు ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ…తమవేనని గుర్తించింది. తన భర్త ఎక్కడున్నాడని సదరు మహిళను ప్రశ్నించింది. అయితే తనకు ఎవరితో సంబంధం లేదని.. అసలు చంద్రమౌళి ఎవరో తనకు తెలియని చెప్పుకొచ్చింది ఆ మహిళ. మరి తన భర్తతో సంబంధం లేకుంటే.. ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయని ప్రశ్నిస్తోంది చంద్రమౌళి భార్య కవిత. తన భర్తకు చాలా మందితో ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని.. కాల్‌మనీ కేసులోనూ ఉన్నాడని.. అతడి నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులను కోరుతోంది కవిత. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇద్దరి నుంచి వివరాలు అడిగి తెలుసుకుని…దర్యాప్తు చేపట్టారు.
న్యాయవాద వృత్తిలో ఉంటూ..కట్టుకున్న భార్యకే అన్యాయం చేశాడంటే..ఇక ఇతరుల పరిస్థితి ఏంటంటూ..అతగాడి బాగోతం తెలిసిన వారంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు భార్య ఉండగానే మరో మహిళతో కాపురం పెట్టిన ఆ లాయర్‌ను కఠినంగా శిక్షించాలంటూ…కవిత బంధువులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.