CM Jagan: అంతర్జాతీయ సదస్సుకు సీఎం జగన్.. WEF ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం అందింది.

Cm Jagan
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం అందింది. 2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొనాలని కోరింది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్.
ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి బోర్జ్ బ్రెండె..మంత్రి గౌతమ్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సారి ‘వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్’ పేరుతో సమావేశం జరగనున్నట్లు బోర్జ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పురోగతిలో.. ఆర్థికంగా అభివృద్ధి చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలు, విప్లవాత్మక పారిశ్రామిక విధానాన్ని ఐటీ శాఖామంత్రి గౌతమ్ రెడ్డి ఆయనకు వివరించారు.
కరోనా కష్టకాలంలో.. కోవిడ్19 నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం చర్యలను బోర్ట్ బ్రెండె ప్రశంసించారు. పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తదితర అంశాలపై అభినందనలు తెలియజేశారు.