YCP – TDP : ఆగస్టు 28న ఢిల్లీలో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు.. ఈసీని కలవనున్న ఇరు పార్టీల నేతలు
వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.

YCP and TDP complaints
YCP – TDP Complaints : ఏపీలో వైసీపీ, టీడీపీ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆగస్టు 28న ఢిల్లీలో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు రెండు పార్టీల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 28న కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలవనున్నాయి.
సాయంత్ర 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.
TTD : 24 మందితో టీటీడీ కొత్త పాలక మండలి.. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం
ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు తెలుగుదేశం పార్టీ అపాయింట్ మెంట్ కోరింది. సాయంత్రం 3.30 గంటలకు టీడీపీకి అపాయింట్ మెంట్ ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది.