ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు.. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు

ఎంపీ మోపిదేవి వెంకటరమణ రేపల్లె పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఈవూరు గణేష్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి వెంకటరమణ..

ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు.. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు

CM Jagan Focus On YCP Fifth List

Updated On : January 23, 2024 / 3:46 PM IST

YCP Fifth List : వైసీపీ ఐదో లిస్టుపై కసరత్తు కొనసాగుతుండగా.. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు తాడేపల్లి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులపై చర్చించేందుకు పలువురు నేతలను సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ,మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం క్యాంప్ ఆఫీసుకి వచ్చారు.

ఇక, ఎంపీ మోపిదేవి వెంకటరమణ రేపల్లె పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఈవూరు గణేష్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి వెంకటరమణ.. తనను రేపల్లె ఇంఛార్జిగా నియమించాలని పట్టుబడుతున్నారు.

Also Read : రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఐదో లిస్టును ప్రిపేర్ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపొచ్చింది. వారంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి చేరుకున్నారు. సీఎం జగన్ ను వారంతా కలవనున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి వచ్చారు. వీరితో జగన్ సమావేశం కానున్నారు. ఇంఛార్జిల మార్పులు, వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై జగన్ చర్చించబోతున్నారు.

మరో కీలక నేత మోపిదేవి వెంకటరమణ సైతం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ను కలవబోతున్నారు. రేపల్లె ఇంఛార్జిగా ఈపూరు గణేశ్ ను నియమించారు. అప్పటి నుంచి కూడా మోపిదేవి వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె ఇంఛార్జిగా తనకు అవకాశం ఇవ్వాలని మోపిదేవి కోరుతున్నారు. ఇటీవల ఈపూరు గణేశ్ ను మార్చే ఆలోచన జగన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో మోపిదేవి వెంకటరమణ జగన్ ను కలిసేందుకు వచ్చారు. రేపల్లె ఇంఛార్జ్ ను మారుస్తారా? లేక ఈపూరు గణేశ్ ను కొనసాగిస్తారా? అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

ఇక, అర్జంటుగా నరసరావుపేట పార్లమెంట్ ఇంఛార్జిగా ఒక బీసీ నేతను ప్రకటించే పనిలో వైసీపీ అధినాయకత్వం ఉంది. పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ నుంచి యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి ఇస్తారా? లేక వేరే సామాజికవర్గానికి ఇస్తారా? అన్నదానిపై క్లారిటీ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గుంటూరు నుంచి బరిలోకి దిగాలని వైసీపీ అధిష్టానం ఆదేశించగా.. అందుకు నిరాకరించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు. దీంతో ఆ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంది. ఇక ఒంగోలు ఎంపీ స్థానం ఇంకా పెండింగ్ లో ఉంది. అక్కడ మాగుంటకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పడంతో కొత్త అభ్యర్థిని ఎవరిని తీసుకురాబోతున్నారు అనేదానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్.