Horoscope Today : ఈ రాశుల వాళ్లకు ఈరోజు తిరుగులేదు..!
పరిపూర్ణ శుభగ్రహాలుగా పేరున్న గురువు, శుక్రుడు ఈరోజును శాసిస్తున్నారు. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నవాళ్లకు ఈ రోజు తిరుగు ఉండదు.

Today Horoscope
Horoscope Today : పరిపూర్ణ శుభగ్రహాలుగా పేరున్న గురువు, శుక్రుడు ఈరోజును శాసిస్తున్నారు. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నవాళ్లకు ఈ రోజు తిరుగు ఉండదు. మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకర రాశి జాతకులకు గురు, శుక్రుల పరివర్తన పరిపూర్ణ అనుగ్రహంగా పరిణమిస్తుంది.

Aries
మేషం: ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎలాంటి సవాలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తారు. అయితే, అత్యుత్సాహం కూడదు. మాటల్లో పొదుపు అవసరం. పనిలో చేవ చూపితే.. ఈ రోజంతా మీదే! ధన లాభం సూచితం. సమయోచితంగా వ్యవహరిస్తారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Taurus
వృషభం: మీ ఓపికకు పరీక్షలు ఎదురవుతాయి. చాలా తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఇది. పట్టువిడుపులు ప్రదర్శిస్తే.. కార్యం సఫలం అవుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. సూర్యారాధన శుభప్రదం.

Gemini
మిథునం: గురువు, శుక్రుడు పనిగట్టుకొని మేలు చేస్తున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రాబడి పెంచుకోవడంపై దృష్టి సారిస్తారు. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలం. ఆరుద్ర నక్షత్రం గలవారికి మరింత మేలు జరుగుతుంది. శివాలయాన్ని సందర్శించండి.

Cancer
కర్కాటకం: మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం సూచితం. ఉద్యోగులకు ఓ శుభవార్త ఆనందాన్నిస్తుంది. పెద్దల అండదండలు లభిస్తాయి. సమయపాలన పాటించడం అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

Leo
సింహం: కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. మాటలను అదుపులో ఉంచుకోవడం అవసరం. డబ్బు మంచి నీళ్లలా ఖర్చవుతాయి. గురువు అనుగ్రహం ఉంది. ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ తగిన ఫలితం అయితే దక్కుతుంది. వినాయకుడి ఆలయాన్ని దర్శించుకోండి.

Virgo
కన్య: రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. చుట్టాలు, స్నేహితులతో కాలం గడుపుతారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకండి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

Libra
తుల: ఆలోచనలు అమలుచేయడంలో ఆలస్యం జరుగుతుంది. పెద్దల సహకారం తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. సమయపాలన అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Scorpio
వృశ్చికం: రావలసిన డబ్బు అందుతుంది. చక్కటి సంగీతం వింటారు. పిల్లలతో సరదాగా కాలం గడుపుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు కాస్త ఆచితూచి వ్యవహరించడం అవసరం. సాయంత్రానికి ఒక శుభవార్త వింటారు. వినాయకుడి గుడికి వెళ్లండి.

Sagittarisu
ధనుస్సు: ఈ రోజు ఓ కీలకమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అది మీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తల్లిదండ్రులతో సరదాగా సంభాషిస్తారు. వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాలభైరవ ఆరాధన శుభప్రదం.

Capricorn
మకరం: మంచి ఆలోచనలు అమలు చేస్తారు. తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందుతారు. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

Aquarius
కుంభం: కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయుల సలహాలు పాటించండి. వాహన మర్మతులు ముందుకురావచ్చు. ఆన్‌లైన్ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. స్త్రీ మూలకంగా ధననష్టం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Pisces
మీనం: శ్రమ పెరుగుతుంది. అందుకు ఆదాయం లభిస్తుంది. పట్టుదలకు వెళ్లకండి. పెద్దల దగ్గర తగ్గి ఉండటం ఈ రోజు అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. అన్నదమ్ముల వల్ల అదృష్టం పలకరిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.