కరోనా దెబ్బకు మార్కెట్లు ఢమాల్.. రంగంలోకి కేంద్రం

కరోనా దెబ్బకు మార్కెట్లు ఢమాల్.. రంగంలోకి కేంద్రం

Updated On : January 28, 2020 / 7:50 AM IST

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్. ఇప్పటికే చైనాలో వందకు పైగా ప్రాణాలు కోల్పోగా ప్రపంచ వ్యాప్తంగా 3వేల మంది బలి అయిపోయారు. దీంతో చైనాకు ఇతర దేశాలకు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. జనవరి 24నుంచి ప్రాణాంతక వైరస్ భయానికి భారత్‌లోని స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపించింది. సోమవారం దీని దెబ్బకు పూర్తిగా దెబ్బతిని దాదాపు 458పాయింట్ల మేర సెన్సెక్స్ పడిపోయింది. 

మెటల్, ఎకానమీ షేర్లకు మాత్రమే అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ నాలుగు నెలల్లో రెండో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. సోమవారం సాయంత్రానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 71.43 వద్ద ముగిసింది. కొత్త సంవత్సర సెలవుల కారణంగా ఆసియా మార్కెట్లు దాదాపు పని చేయడం లేదు. జపాన్‌ నిక్కీ 2 శాతం పడిపోయింది. ఐరోపా సూచీలు కూడా నష్టాల్లో ట్రేడింగ్ అయ్యాయి.

ల్యూనార్ న్యూ ఇయర్ సందర్భంగా మూడు రోజుల పాటు చైనామార్కెట్లన్నీ సెలవులో ఉన్నాయి. అన్నీ అనుమానస్పదమే కానీ, హైదరాబాద్, జైపూర్, బీహార్ లోని చప్రా, బెంగళూరు, కేరళలో ఏ కేసు నిర్దారణ కాలేదు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చైనాలోని వుహాన్ లో పేషెంట్ల కోసం ప్రత్యేక విమానం పంపారు. 

దీని నుంచి కోలుకునేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.’దేశంలోని అన్ని హోటళ్లకు సమాచారం అందించాం.నేపాల్ నుంచి ధార్మిక పర్యటనకు వచ్చే యాత్రికుల గురించి సమాచారం తెలియజేయాలని సూచించాం’ అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ ప్రీతి సూడన్ తెలిపారు. మైక్రో బయాలజిస్ట్ అండ్ ఇన్‌ఫెక్టియోస్ నిపుణులైన సునీల్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఈ వైరస్ భయం చైనాకు మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్త సమస్యగా మారింది. రోజు మారుతుంటే కేసులు, మరణాలు ఎక్కువవుతున్నాయి’ అని తెలిపారు. 

మంగళవారం మార్కెట్లలో లాభాలు:
కరోనా వైరస్‌ వ్యాప్తి భయాలతో సోమవారం డీలాపడ్డ మార్కెట్లు మంగళవారానికి కోలుకున్నాయి. మధ్యాహ్నం 1గంట 20నిమిషాల సమయంలో నిఫ్టీ లాభంతో 12వేల 133 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 84 పాయింట్ల పైకి ఎగబాకి 41వేల 230 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.26 వద్ద కొనసాగుతోంది.