Gold Rates: షాకింగ్.. వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలుసా.. రికార్డు బద్దలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో మంగళవారం బంగారం ధర పెరిగింది.

Gold
Gold And Silver Price Today: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం అంటేనే బెంబేలెత్తిపోయేలా ధరలు పెరుగుతున్నాయి. గోల్డ్ రేటు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టడంతో గోల్డ్ కు డిమాండ్ పెరుగుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కావడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. రూపాయి విలువ సోమవారం 88 లెవెల్ వరకు తగ్గింది. చివరికి కొంచెం బలపడి 87.45 దగ్గర సెటిలైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడంతో గోల్డ్ కు ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి.
Also Read: Astrology Tips : రుద్రాక్ష ధరించే ముందు గుర్తుంచుకోవాల్సిన 9 విషయాలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?
ఈనెల 4వ తేదీ నుంచి బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఇవాళ పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటే.. గడిచిన ఎనిమిది రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై సుమారు రూ.4వేలు పెరిగింది. అయితే, ప్రస్తుతం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.87,930కు చేరింది. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ.80,600 రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈనెల 6వ తేదీ నుంచి వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
Also Read: అబ్బురపరుస్తున్న వీడియో.. తోటి విద్యార్థి కోసం ఈ చిన్నారులు ఎంత గొప్ప పనిచేశారో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,930.
♦ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,07,000 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.80,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.88,080.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో బంగారం ధర ఒకేలా ఉంది.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,930.
వెండి ధర ఇలా..
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,500.
♦ చెన్నైలో కిలో వెండి ధ రూ. 1,07,000గా నమోదైంది.