బాబోయ్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

బాబోయ్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold

Gold And Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర మళ్లీ పెరిగింది. గత ఐదు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ, తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. బుధవారం భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ. 220 పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 300 తగ్గింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,930 మార్క్ కు చేరింది.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 67,080.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,350 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,930.
    చెన్నైలో తులం బంగారంపై రూ.150 పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.62,150 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.67,800 మార్క్ కు చేరింది.

 

  • తగ్గిన వెండి ధర ..
    దేశం వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.80,200కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 80,200 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.77,200 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,250 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.