బాబోయ్.. మూడ్రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా? రూ.70వేలకు చేరువలో గోల్డ్ రేటు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

బాబోయ్.. మూడ్రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా? రూ.70వేలకు చేరువలో గోల్డ్ రేటు

Gold

Gold Rate in Hyderabad : బంగారం ధర భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.600 పెరగ్గా.. శుక్రవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ. 1400 పెరిగింది. దీంతో మూడు రోజుల్లో 10 గ్రాముల గోల్డ్ పై రూ. 2వేలు పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 300 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 80,800కు చేరింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,000 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,730 మార్క్ కు చేరింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 68,880.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 63,000 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 68,730.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.63,900 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.69,710 మార్క్ కు చేరింది.

Gold

  • పెరిగిన వెండి ధర ..
    దేశం వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.80,800కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 80,800. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.77,800 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.75,800 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.