Gold Price: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఏమిటంటే..?

తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..

Gold Price: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఏమిటంటే..?

Gold And Silver Price

Updated On : November 7, 2024 / 10:51 AM IST

Gold and Silver Price Today: గత నెల రోజులుగా భారీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాము 24 క్యారట్ల బంగారంపై రూ. 1,790 తగ్గగా.. కిలో వెండిపై రూ. 3వేలు తగ్గుదల చోటు చేసుకుంది. అయితే, బంగారం, వెండి ధరలు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి.

Gold Rate

అక్టోబరు నెలలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలకు బంగారం, వెండి ధరలు చేరిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా, దేశీయంగా గిరాకీ తగ్గడంతో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దీపావళి ముందొచ్చే ధన త్రయోదశి సందర్భంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం వరుస పండుగల హడావుడి తగ్గడంతోపాటు.. శుభకార్యాలూ తగ్గుముఖం పట్టడంతో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దీనికితోడు అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతోనూ బంగారం ధరలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున డాలర్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలను బట్టి పసిడి ధరలు కదలాడే అవకాశం ఉందని, ఔన్సు బంగారం 2600 డాలర్ల స్థాయికి దిగిరావచ్చనే అంచనాను ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,000కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.78,560 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,150 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 78,710.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.72,000 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 78,560.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,000 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 78,560 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా ..
గురువారం వెండి ధర భారీగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,02,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,02,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 93,000.
బెంగళూరులో కిలో వెండి ధర 93,000 వద్ద కొనసాగుతుంది.

Gold

పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.