పెరుగుతున్న బంగారం ధరలు

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 11:55 AM IST
పెరుగుతున్న బంగారం ధరలు

Updated On : April 19, 2019 / 11:55 AM IST

మరలా బంగారం ధర పెరుగుతోంది. బంగారం వ్యాపారుల నుండి డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. గురువారం రూ. 405 తగ్గిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ధరలు పెరిగాయి. ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 305 ధర పెరిగి రూ. 32 వేల 690కి చేరింది. బంగారం కొనుగోళ్లు ఊపందుకోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు.

10 గ్రాముల బంగారం ధర రూ. 32 వేల 530కు చేరింది. మరో పక్క వెండి ధర కూడా పెరుగుతోంది. కిలో వెండి రూ. 204 పెరిగి రూ. 38 వేల 450 వద్దకు చేరుకుంది. నాణేల తయారీదారుల నుండి డిమాండ్ ఉండడంతో వెండి ధరలు పెరుగుతున్నాయని బిజినెస్ వ్యాపారులు అంటున్నారు. గుడ్ ఫ్రైడే కావడంతో బులియెన్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు.