Matter Aera Electric Bike : ‘మ్యాటర్ ఏరా’ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ప్రీ-రిజిస్ట్రేషన్ ధరలివే.. ఏ మోడల్ ధర ఎంతంటే?
Matter Aera Electric Bike : అహ్మదాబాద్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కంపెనీ మ్యాటర్ (Matter Aera) ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రవేశపెట్టింది. భారత్‌లోనే మొట్టమొదటి మాన్యువల్ గేర్‌షిఫ్ట్ మోడల్ ఎలక్ట్రిక్ బైక్.

Matter Aera electric motorcycle launched, check prices here
Matter Aera Electric Bike : అహ్మదాబాద్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కంపెనీ మ్యాటర్ ఎనర్జీ నుంచి (Matter Aera) ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రవేశపెట్టింది. భారత్‌లోనే మొట్టమొదటి మాన్యువల్ గేర్‌షిఫ్ట్ మోడల్ ఎలక్ట్రిక్ బైక్.. మ్యాటర్ ఏరా 4000, Aera 5000, Aera 5000+, Aera 6000+ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రస్తుతం Aera 5000, Aera 5000+ ప్రీ-రిజిస్ట్రేషన్ ధరలను ప్రకటించింది. Aera 5000, Aera 5000+ ధరలు వరుసగా రూ. 1,43,999, రూ. 1,53,999గా ఉన్నాయి. Matter Aera ప్రీ-రిజిస్ట్రేషన్ ధరలు దేశమంతటా ఒకే విధంగా ఉండనున్నాయి.
Aera బైక్ ప్రీ-రిజిస్ట్రేషన్ త్వరలోనే ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఏరా ప్రీ-రిజిస్ట్రేషన్ ధరలు సబ్సిడీలు, GST స్లాబ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ మద్దతును పరిశీలిస్తున్నాయని మేటర్ కంపెనీ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చని పేర్కొంది. Matter Aera 5000, 5000+ వేరియంట్‌లు 10kW మోటార్‌ను ఇంటర్నల్‌గా అభివృద్ధి చేసిన 5kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చాయి.

Matter Aera Electric Bike : Matter Aera electric motorcycle launched
ఇందులో యాక్టివ్ లిక్విడ్ కూలింగ్‌ని ఉపయోగించే ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IITMS)తో సహా మల్టీ పేటెంట్ టెక్నాలజీలు ఉన్నాయని పేర్కొన్నారు. మోటార్ హైపర్‌షిఫ్ట్ 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. 6000+ వేరియంట్‌లో 6kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. రెండు వేరియంట్‌లకు పరిధి 125కిమీ అయితే, ఆరు సెకన్లలోపు 0-60కిమీ వేగాన్ని అందుకోగలవు. సాధారణ ఛార్జింగ్ ద్వారా 5 గంటల్లో ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 2 గంటలలోపు బ్యాటరీ ప్యాక్ పూర్తి అవుతుంది.
స్టేబుల్ మొబిలిటీ టూల్స్ వంటి ఇతర బెనిఫిట్స్ పొందాలంటే వినియోగదారులు అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉందని మేటర్ గ్రూప్ వ్యవస్థాపకుడు CEO మోహల్ లాల్భాయ్ అన్నారు. గత నాలుగు ఏళ్లుగా మేటర్ కంపెనీ మొదటి నుంచి ఒక ప్రొడక్టును మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత ఫ్యూచరిస్టిక్ మోటార్‌బైక్, Aera బైకును అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలోని అందరి వినియోగదారులకు ఆసక్తికరమైన ధరతో సరికొత్త ఆప్షన్లతో అందించనున్నట్టు మోహల్ తెలిపారు.
Read Also : WhatsApp Accounts Ban : భారత్‌లో 29లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!