మీ ఫోన్ ఇదేనా?: నో ఇంటర్నెట్.. వేగంగా Files షేర్ చేయొచ్చు!

  • Published By: sreehari ,Published On : January 3, 2020 / 02:09 PM IST
మీ ఫోన్ ఇదేనా?: నో ఇంటర్నెట్.. వేగంగా Files షేర్ చేయొచ్చు!

Updated On : January 3, 2020 / 2:09 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు షియోమీ, వివో, ఒప్పో బ్రాండ్లలో ఏదైనా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ లోకి ఈజీగా వేగవంతంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ కూడా అక్కర్లేదు. పీర్ టూ పీర్ ట్రాన్స్ మిషన్ అలియన్స్ ద్వారా వైర్ లెస్ ఫైల్స్ షేరింగ్ చేయొచ్చు. ప్రపంచ పోటీదారు ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టిన AirDrop కు పోటీగా చైనా దిగ్గజాలు ఒప్పో, వివో, షియోమీలు చేతులు కలిపి ఫైల్ షేరింగ్ సర్వీసును లాంచ్ చేశాయి.

అదే.. Peer to Peer సర్వీసు. దీని ద్వారా తమ డివైజ్‌ల్లో ఫైల్ షేరింగ్ వేగవంతం చేయడానికి ఇకపై అనుమతి ఉంటుంది. షియోమీ, ఒప్పో, వివో ఫోన్ యూజర్లు ఈ సర్వీసును లాంచ్ చేయడం ద్వారా తమ డివైజ్ లోని ఫైల్స్, ఇమేజ్ లు, వీడియోలు, మ్యూజిక్, డాక్యుమెంట్లు ఒకదానికి మరొకటి వేగంగా షేర్ చేసుకోవచ్చు. ఆపిల్ అందించే Airdrop సర్వీసు మాదిరిగా పీర్ టూ పీర్ సర్వీసు పనిచేస్తుంది.

ఈ సర్వీసుకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. వేగంగా Pairing చేసుకునేందుకు ఇంటర్నెట్‌కు బదులుగా Bluetooth Low Energy (BLE) వాడొచ్చు. Data Transfer కోసం peer-to-per Wi-Fi కనెక్షన్ వాడొచ్చు. ఒక సెకన్‌కు 20MP స్పీడ్ తో డేటా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చునని కంపెనీలు వెల్లడించాయి. ఇంటర్నెట్ కోసం Wi-Fi కనెక్షన్ వాడే వారు కూడా ఇదే స్పీడ్ తో డేటా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

Peer to Peer service ఎలా వాడాలంటే? :
* Oppo, Vivo, Xiaomi యూజర్లు ముందుగా తమ డివైజ్‌లో Bluetooth, Wi-Fi, File transferring ఫంక్షన్ Turn on చేయాలి.
* File transferring function టర్న్ ఆన్ చేయాలంటే యూజర్లు తమ డివైజ్ Settings ఓపెన్ చేయాలి.
* డివైజ్ హోం స్ర్కీన్‌పై Swiping down చేశాక Share Button పై Press చేయాలి.
* ఫైల్ Receive చేసుకునే User సైతం అలానే Share Buttonపై నొక్కాలి.
* Pairing పూర్తి అయ్యాక ఏ ఫైల్ షేర్ చేయాలో దానిని ఎంచుకోవాలి.
* Continue బటన్‌పై Press చేయగానే Confirm అంటూ prompt మెసేజ్ వస్తుంది.
* Receiver కూడా Confirm చేసిన తర్వాత రెండు డివైజ్‌ల నుంచి File Transfer మొదలువుతుంది.

ప్రస్తుతం.. ఈ సర్వీసు గూగుల్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే డివైజ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సర్వీసు ఆల్ Oppo, Vivo, Xiaomi స్మార్ట్ ఫోన్లలో Liveలో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వీసును నెమ్మదిగా రిలీజ్ చేయనున్నాయి. పీర్ టూ పీర్ సర్వీసును రీకాల్ చేయడానికి చైనాలో టెస్టింగ్ జరుపుతున్నాయి. ఇప్పుడు ఈ సర్వీసు చైనాలోని అన్ని ఒప్పో, వివో, షియోమీ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చేశాయి.