సాంకేతిక ఆర్థిక మాంద్యంలోకి భారత్ : Q2 GDP డేటా

  • Published By: sreehari ,Published On : November 27, 2020 / 10:28 PM IST
సాంకేతిక ఆర్థిక మాంద్యంలోకి భారత్ : Q2 GDP డేటా

Updated On : November 28, 2020 / 7:04 AM IST

India officially in technical recession : కరోనా సంక్షోభంలో లాక్ డౌన్లతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. వ్యాపార, వాణిజ్య, రవాణా వంటి అనేక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 23.9 శాతంతో పోలిస్తే.. రెండవ త్రైమాసికంలో జీడీపీ 7.5 శాతం నెమ్మదిగా క్షీణించింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ అధికారికంగా సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. Q2 GDP (FY21) డేటాను పరిశీలిస్తే.. సాంకేతిక ఆర్థిక మాంద్యంలోకి భారత్ ఎంటర్ అయినట్టే కనిపిస్తోంది.



మరోవైపు GVA కూడా 7 శాతం మేర క్షీణించింది. రెండవ త్రైమాసికంలో స్వల్ప వృద్ధిని చూపించిన ఉత్పాదక రంగంలో భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంది. కానీ, ప్రైవేట్ వినియోగంలో మాత్రం 11.5 శాతం మేర తగ్గిందనే చెప్పాలి.

ప్రైవేట్ డిమాండ్ తిరిగి పుంజుకోవడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయి.



ఫలితంగా మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 23.9 శాతంతో భారీగా క్షీణించింది. అయినప్పటికీ వరుసగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని సూచించింది. అధిక పౌన పున్య సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించింది.

(National Statistical Office) ఈ రోజు విడుదల చేసిన ఫలితాల్లో మూడవ త్రైమాసికం నుంచి ఆర్థిక వ్యవస్థలో మెరుగదలను సూచిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్లను క్రమంగా సడలించడంతో రెండవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.



అనేక అధిక పౌన పున్య సూచికలు రికవరీ అవుతున్నట్టు చూపించాయి. మొదటి త్రైమాసికంలో 39 శాతానికి పైగా కాంట్రాక్షన్‌తో పోలిస్తే.. తయారీలో GVA 0.6 శాతం వృద్ధిని సాధించింది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగదారుల సేవలు 4.4 శాతానికి పెరిగాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య రంగం 3 శాతానికి పైగా వృద్ధి చెందాయి. నిర్మాణం రంగంలో జివిఎ 8 శాతానికి పైగా క్షీణించింది. ట్రేడ్ అండ్ హోటల్ రంగాలు కూడా 15 శాతానికి పైగా క్షీణించాయి.



ప్రభుత్వ వ్యయం, రక్షణ, ఇతర సేవలు 12 శాతం, ఆర్థిక, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగం 8.1 శాతం మేర తగ్గాయి.ఆర్థిక వ్యవస్థలో ఊహించిన దానికంటే వేగంగా పుంజుకోవడంపై ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆశావాదం వ్యక్తం చేశారు.

పండుగ సీజన్ పెంట్-అప్ డిమాండ్ కారణంగా రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిలోకి వస్తుందని భారత మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ అన్నారు. అదేగాని జరిగితే.. మూడవ త్రైమాసికం అధ్వాన్నంగా కనిపించే అవకాశం ఉందని సేన్ హెచ్చరించారు.