పన్ను తక్కువ కట్టండి… ఎక్కువ ఖర్చు చేయండి.. ప్రజలకు ఆర్ధికమంత్రి చెప్పింది ఇదే.

బడ్జెట్ ప్రసంగం మొదలు ఆర్ధికమంత్రి నిర్మల సీతారమన్ ఉద్దేశం ఒక్కటే… జనం ఖర్చు చేయడానికి జేబులో కొంత మగిల్చడం. నీరసపడ్డ ఆర్ధిక వ్యవస్థకు కొనుగోళ్లకు కాస్తంత ఊపుతీసుకురావడం. అందుకే బడ్జెట్లో మధ్యతరగతి, ఉద్యోగస్తుల ఖర్చు చేయడానికి పాకెట్ మనీ ఇవ్వాలనుకున్నారు ఆర్ధికమంత్రి. ఆపని చేసినట్లే కనిపించారు.
ముందు రూ.5లక్షల వరకు ఆదాయపన్నును కట్టాల్సిన అవసరమేలేదు. వేతనజీవులకు సంతఈప్తికోసం ఇన్ కమ్ టాక్స్ స్లాబ్లను ఎడాపెడా మార్చేశారు. ఏడున్నర లక్షల వరకు 10శాతం టాక్స్ ఆ తర్వాత 10 రూ.10లక్షల వరకు 15శాతం టాక్స్ అన్నారు. ఆతర్వాత మరో రెండున్నర లక్షల కోసం మరో ఐదుశాతం టాక్స్ ను పెంచారు. ప్రతిరెండున్నుర లక్షలకు ఐదుశాతం చొప్పున టాక్స్ను పెంచుకొంటూ పోయారు.
ఈ కొత్త స్లాబ్ల వల్ల జనం చేతిలో సొమ్ము ఆడుతుందని తెలుగింటి కోడలు నమ్మారు. తక్కువ టాక్స్ల వల్ల ఖర్చు ఎక్కువ చేస్తారని… మార్కెట్ కళకళ్లాడుతుందను అంచనావేస్తున్నారు. నగదు బదిలీ పథకం వల్ల మార్కెట్లలోకి డబ్బువచ్చిపడుతున్న సంగతి నిర్మలా సీతారామన్ కు బాగా తెలుసు.
అందుకే ఈ ఆదాయపన్నుస్లాబ్లను మార్చడం ద్వారా అనుకుంది సాధించాలనుకున్నారు. కాకపోతే కొన్ని షరతులు వర్తిస్తాయని అన్నారు. సెక్షన్ 80 (c)ద్వారా ప్రయోజనాలను పొందాలనుకున్నవారికి మాత్రం పాత స్లాబ్లే వర్తిస్తాయి. 80 (c)వల్ల ఫిక్సడ్ డిపాజిట్లు, సేవింగ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మ్యూచివల్ ఫండ్స్ వల్ల యేడాదికి రూ.1.5 లక్షలు వరకు ప్రయోజనాలను పొందొచ్చు.
నిజానికి నిర్మలాసీతారామన్… ఈ బడ్జెట్లో అదరగొడతారని… సమూలంగా భారతదేశాన్ని మార్చేశారని అనుకున్నారు. తీరాచూస్తే… ఏ వర్గానికి సంతృప్తి లేదు… ఏ రంగానికి ప్రాధాన్యత లేదు. ఆదాయపన్ను ద్వారా కొంత మనీని చేతిలో మిగల్చాని అనుకున్నారు. అదికూడా సంతృప్తికరంగా చేశారాఅంటే… డౌటే.
మన జీడీపీలో ఇంటి ఖర్చే సగం కన్నా ఎక్కువ. 201920లో జీడీపీ ఐదుశాతం మేర ఎదుగుతందని అనుకున్నా….2013 తర్వాత ఇదే అతి తక్కువ వఈద్ధిరేటు నమోదైనట్లే. అందుకే కొన్ని మార్పులు ఇప్పటికే వచ్చాయి. 2019లో కార్పొరేట్ టాక్స్ ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. 2019 అక్టోబర్ తర్వాత పెట్టే తయారీ యూనిట్లు చెల్లించే పన్నును 17శాతానికి తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని విద్యుత్ రంగ సంస్థలకు ఇచ్చారు.
పల్లెటూరుకి నిధుల కళ… కళ…
గ్రామీణ భారతం విలువ ఆర్ధికమంత్రికి తెలుసు. అందుకే వ్యవసాయరంగానికి ఉత్సాహాన్ని పెంచడానికి కొత్తతరమూ ఆగ్రోబిజినెస్ లో దిగడానికి కొంత ప్రొత్సాహం ఇవ్వాలనుకున్నారు. నిజానికి గ్రామీణ ఆర్దికవ్యవస్థకు భారీగా నిధులను కేటాయించారు. 2020-21లో పధకాలు, కార్యక్రమాల కోసం రూ. 2.83లక్షల కోట్ల నిధులను కేటాయించారు. అంతేనా… ఎగుమతులకు కేటాయింపులు పెరిగాయి. వ్యవసాయ రంగానికి ప్రోత్సహాకాలు, పథకాలు, రైతాదాయం రెండింతల కోసం మెకానైజేషన్ కు కావాల్సిన రుణాలను పెంచాయి. పల్లెటూరి జనం ఖర్చుచేయడానికి కొంత డబ్బు మిగిలేలా చూశారు.