Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 100 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ కూడా 15,100 మార్క్ వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల బాటపట్టాయి.

Stock Markets Sensex Down 100 Points, Nifty Around 15,100; Banks, Auto Drag
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ కూడా 15,100 మార్క్ వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల బాటపట్టాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 85 పాయింట్లు దిగజారి 50,200 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ కొన్ని పాయింట్లతో నష్టపోయి 15,100 వద్ద కొనసాగుతోంది.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.04 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ప్రతికూలంగానే ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా బ్యాంకు టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి.