17 ఏళ్ల మైనర్‌ను పిక్‌నిక్ అని 32ఏళ్ల వ్యక్తి యూపీకి తీసుకెళ్లాడు…పెళ్లిచేసుకున్నాడు…రేప్ చేశాడు.

17 ఏళ్ల మైనర్ బాలికను పిక్నిక్ పేరుతో తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ముంబై కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను పిక్సిక్ కు వెళదామని చెప్పి ఉత్తర ప్రదేశ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెతో శృంగారం జరిపాడు.
తిరిగి ఇంటికి వచ్చిన ఆ బాలిక తల్లి తండ్రులకు విషయం చెప్పింది. దాంతో వారు అతడిని నిలదీశారు. అప్పటికే అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలిక తల్లితండ్రులు పోలీసు కంప్లయింట్ ఇవ్వకుండా ఆ వ్యక్తి వారిని బెదిరించాడు.
బాలిక తండ్రి తన స్నేహితుడి సహాయంతో సకినాకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 376 (అత్యాచారం), 341 (తప్పుడు సంయమనం), 342 (తప్పుడు నిర్బంధం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012 యొక్క సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.