Husband Killed Wife : భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం జరిగింది. భర్తే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. భార్యను అతికిరాతకంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన తెలకపల్లి మండలం గౌరారంలో చోటు చేసుకుంది.

Husband Killed Wife : భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

husband killed wife

Updated On : November 3, 2022 / 9:37 PM IST

Husband Killed Wife : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం జరిగింది. భర్తే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. భార్యను అతికిరాతకంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన తెలకపల్లి మండలం గౌరారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గౌరారంకు చెందిన చెన్న రాములుకు ఎల్లమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. చెన్న రాములు ఆగ్రహంతో భార్యను తీవ్రంగా కొట్టి, గొంతు నిలిమి చంపాడు. అయితే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అనుమానం వచ్చిన మృతురాలు తల్లి సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Murder For Omelette : షాకింగ్.. ఆమ్లెట్ వేయలేదని భార్యను చంపిన భర్త

ఆమె ఫిర్యాదు మేరకు చెన్న భర్త రాములుపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.