జార్ఖండ్ లో షా ర్యాలీ…బీజేపీ ఆఫీస్ పేల్చేసిన నక్సల్స్

జార్ఖండ్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ అభ్యర్ధి అర్జున్ ముందా ఇదే కార్యాలయం నుంచి పనిచేస్తున్నారు.
మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షా ఇవాళ(మే 03-2019) ఖుంటి, కొడెర్మా, రాంచీల్లో ప్రచార ర్యాలీలు నిర్వహించనున్నారు. నక్సల్స్ దాడికి గురైన ఖర్సవన్ బీజేపీ కార్యాలయం ఖుంటి లోక్‌సభ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఐదో దశలో భాగంగా మే-6,2019న పోలింగ్ జరగనుంది. రెండు రోజుల క్రితం మహారాష్రలోని గడ్చిరోలి జిల్లాల్లో నక్సలైట్లు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.