డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం

అమలాపురంలో డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ ఘటన రాష్త్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం సూసైడ్ చేసుకోవడానికి కాల్ మనీ వేధింపులే కారణమని తెలుస్తోంది. రామకృష్ణంరాజు సన్నిహితులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 30, 2019) డాక్టర్, ఆయన భార్య, కొడుకు సూసైడ్ చేసుకున్నారు.
డాక్టర్ కృష్టంరాజుది ముమ్మాటికీ వడ్డీ వేధింపుల హత్యే అని స్ధానిక డాక్టర్, ఒకప్పటి కృష్ణంరాజు పార్టనర్ కేవీ ధన్వంతరీ నాయుడు ఆరోపించారు. డాక్టర్ కృష్ణంరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టటానికి స్ధానిక వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి వడ్డీ వ్యాపారులు ప్రతిరోజు సాయంత్రం వడ్డీ వసూలు చేసుకువెళ్లేవారని ఆయన మిత్రుడు వాపోయారు. కృష్ణంరాజుకి రూ.10 కోట్లు అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడం, కృష్ణంరాజు కొన్న భూములు అమ్ముడు పోకపోవటం, వడ్డీలు కట్టటానికి చేతిలో డబ్బు లేకపోవటంతో కృష్ణంరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. సీఎం జగన్ ఇప్పటికైనా రాష్ట్రంలో కాల్ మనీ రాకెట్ ను కట్టడి చేయాలని డాక్టర్ నాయుడు కోరారు.