కామారెడ్డిలో కాల్పుల కలకలం : AR కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ తగదాలు..ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది చావే శరణ్యం అనుకుంటున్నారు. ఉన్నతాధికారుల వత్తిడిలు చేస్తున్నారంటూ..మరికొంతమంది ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కామారెడ్డిలో ఓ AR కానిస్టేబుల్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనితో ఆ శాఖలో కలకలం రేగింది.
1991లో బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ AR కానిస్టేబుల్‌గా కామారెడ్డి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను గతంలో నిజామాబాద్‌లో పనిచేశాడు. మే 03వ తేదీ శుక్రవారం డ్యూటీలో ఉండగానే 303 వెపన్‌తో ఎడమ కాలుపై కాల్చుకున్నాడు. బుల్లెట్ శబ్ధం విన్న తోటి సిబ్బంది వచ్చి చూశారు. రక్తపు మడుగులో శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. అసలు ఎందుకు కాల్చుకున్నాడో తెలియడం లేదు. కుటుంబ తగాదాలు..ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మరోవైపు AR కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఆత్మహత్యకు పూనుకున్నాడని తెలుసుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు.