విషాదం : తిరుమల కాలినడక మార్గంలో బీటెక్ విద్యార్ధి మృతి

విషాదం : తిరుమల కాలినడక మార్గంలో బీటెక్ విద్యార్ధి మృతి

Updated On : February 28, 2021 / 10:38 AM IST

B.Tech student died in Tirumala pathway  : తిరుమల నడకదారిలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోటానికి కాలినడకన బయలుదేరిన బీటెక్ విద్యార్ది గుండెపోటు వచ్చి మరణించాడు.

హైదరాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్ కుటుంబ సభ్యులతో అలిపిరి కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలు దేరాడు. గాలిగోపురం వద్దకు రాగానే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడి ఆయాసం వచ్చింది. వెంటనే టీటీడీ సిబ్బంది ప్రధమ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఊపిరి అందక రాహుల్ అక్కడే కుప్ప కూలి మృతి చెందాడు.