నుమాయిష్ చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం నుమాయిష్ జరుగుతుండటంతో

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం నుమాయిష్ జరుగుతుండటంతో
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం నుమాయిష్ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆంధ్రాబ్యాంకు స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. నుమాయిష్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అగ్నిప్రమాదం. 2019, జనవరి 30వ తేదీ రాత్రి 8.30గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో 40 వందల స్టాల్స్ కాలి బూడదయ్యాయి. దట్టమైన పొగలతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పక్క స్టాల్స్‌కు మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. 15 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
* నుమాయిష్ చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదం
* ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు
* షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం
* 400 స్టాల్స్ దగ్ధం
* స్టాల్స్‌లో ఎక్కువగా బట్టలు, తినుబండారాలు, టాయ్స్ షాపులు
* పెద్ద సంఖ్యలో స్టాక్ ఉండటంతో అదుపులోకి రాని మంటలు
* కోట్ల రూపాయల ఆస్తి నష్టం
* పలువురికి తీవ్రగాయాలు, నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు
* రంగంలోకి దిగిన 15 ఫైరింజన్లు
* షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం