Armoor Bike Scam : ఇదేందిది… ఇదెక్కడి బైక్ స్కామ్‌రా నాయనా.. సినిమాల్లో కూడా చూడలేదు..

కొందరు ముఠాగా ఏర్పడి, కింగ్ కోటి కేంద్రంగా వివిధ కంపెనీల బైకులు కొనుగోలు చేస్తారు.

Armoor Bike Scam : ఇదేందిది… ఇదెక్కడి బైక్ స్కామ్‌రా నాయనా.. సినిమాల్లో కూడా చూడలేదు..

Updated On : February 16, 2025 / 4:47 PM IST

Armoor Bike Scam : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో దొంగ బైక్ ల స్కామ్ సంచలనంగా మారింది. దొంగ బైక్ ల స్కామ్ వ్యవహారం ఆర్మూర్ ను కుదిపేస్తోంది. దొంగ బైకుల కేసులో ఎమ్మెల్యే అనుచరుని పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దొంగ బైక్ ల కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. పోలీసులు 24 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.

కొందరు ముఠాగా ఏర్పడి, కింగ్ కోటి కేంద్రంగా వివిధ కంపెనీల బైకులు కొనుగోలు చేస్తారు. అయితే, వాటిని వినియోగదారులకు విక్రయించకుండా వాహనాలు చోరికి గురైనట్లు వివిధ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా వాహనాల బీమా సొమ్ము క్లెయిమ్ చేసుకుంటారు. ఆపై రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులకు సగం ధరకు బైక్ లను విక్రయిస్తున్నారు.

Also Read : పని పని అని పరిగెత్తాడు.. రూ.7.8కోట్ల జీతం కొట్టాడు .. కట్ చేస్తే భార్య వదిలేసింది..

హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసులు రంగంలోకి దిగారు. దొంగ బైక్ ల స్కామ్ పై దర్యాప్తు చేపట్టారు. బీమా సొమ్ము కాజేసే విధానం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.