ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి హత్యాచారం.. ప్రియుడు అనుమానాస్పద మృతి

  • Published By: sreehari ,Published On : August 31, 2020 / 06:29 PM IST
ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి హత్యాచారం.. ప్రియుడు అనుమానాస్పద మృతి

Updated On : August 31, 2020 / 6:37 PM IST

ప్రేమించానున్నాడు.. పెళ్లి చేసుకుందామన్నాడు.. ప్రియురాలు నమ్మింది.. అతడి వెంట నడిచింది. కానీ, అతడిలో అనుమానమే మృగం బయటకు వచ్చింది.. ప్రేమించిన అమ్మాయినే కనికరం లేకుండా స్నేహితుడితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఆపై ప్రియురాలిని దారుణంగా హత్యచేశాడు.. చివరకు ప్రియుడు సైతం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ప్రియురాలి పట్ల అనుమానమే అతడి పాలిట శాపమైంది.. ప్రియురాలిని చంపిన



రెండు రోజుల్లోనే అతడు కూడా అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలానికి చెందిన యువతి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అత్యాచారం, హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.

గొల్నెపల్లి గ్రామానికి చెందిన మిర్యాల రవి కరెంట్ హెల్ఫర్ గా పనిచేస్తున్నాడు. అతనికి యువితితో కొన్ని నెలల క్రితం పరిచయడం ఏర్పడి ప్రేమవరకు వెళ్లింది. అయితే కొన్ని రోజులుగా ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించాడు.



తనను మోసం చేసిన ప్రియురాలిని ఎలాగైనా అంతం చేయాలని భావించాడు.. తన స్నేహితుడు రవితేజతో కలిసి మర్డర్ స్కెచ్ వేశాడు.. అవసరానికి డబ్బులు కావాలంటే ఇస్తానని ఆమెను పిలిచాడు.. తల్లికి వైద్యం చేయించేందుకు స్కూటీపై వలిగొండకు వచ్చింది.

ఆ తర్వాత తల్లిని మార్కెట్ దగ్గర వదిలేసింది. వలిషాపగుట్ట దగ్గరకు రమ్మంటే వెళ్లింది. అక్కడే ఆమెపై రవి, రవితేజలు అత్యాచారం చేశారు. ఆపై బాధితురాలి మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని పక్కనే చెట్లపొదలో పడేసి కంప కప్పి పారిపోయారు..



యువతిని హత్య చేసిన రెండు రోజుల తర్వాత ప్రియుడు రవి మృతదేహం కనిపించింది. అనుమానాస్పద మృతిగా భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవి స్నేహితుడిని అరెస్ట్ చేయడంతో హత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. రవితేజపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండుకు తరలించారు.