ఎన్టీఆర్ సినిమా కథ కాదు: రెండు రూపాయల గొడవ.. పొడిచి చంపేశాడు

  • Published By: madhu ,Published On : November 10, 2019 / 03:38 AM IST
ఎన్టీఆర్ సినిమా కథ కాదు: రెండు రూపాయల గొడవ.. పొడిచి చంపేశాడు

Updated On : November 10, 2019 / 3:38 AM IST

అరవింద సమేత సినిమా చూస్తే అందులో కథ గురించి తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐదు రూపాయలు కోసం హత్య జరుగుతుంది. ఇదే సినిమా కథకు మూలం. ఇది వాస్తవానికి జరిగే అవకాశం లేదు అనుకుంటుంటాం కదా? కానీ ఇదే జరిగింది. అవును నిజం.. ఇదే జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వలసపాకలో రెండు రూపాయల గొడవలో ఓ వ్యక్తి ఇంకో వ్యక్తిని హత్య చేసేశాడు.

వివరాల్లోకి వెళ్తే..  తూర్పుగోదావరి జిల్లా వలసపాకలో సైకిల్‌ షాపులో సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్కు గాలి కొట్టించుకున్నాడు. తర్వాత రెండు రూపాయల కోసం షాపు యజమాని సాంబతో గొడవపడ్డాడు. చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న సాంబ ఫ్రెండ్ అప్పారావు తీవ్ర ఆగ్రహానికి లోనై సువర్ణరాజును కత్తితో పొడిచేశాడు. దీంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు సువర్ణరాజు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగా అప్పటికే సువర్ణరాజు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. 

సువర్ణరాజును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
Read More : చంద్రబాబుకి 16 ఏళ్లు జైలు ఖాయం : మంత్రి సంచలన వ్యాఖ్యలు