గ్రేటర్ నోయిడాలో యాక్సిడెంట్..8 మంది మృతి

యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు ఓ ట్రక్కు మీదకు దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 04:21 AM IST
గ్రేటర్ నోయిడాలో యాక్సిడెంట్..8 మంది మృతి

Updated On : March 29, 2019 / 4:21 AM IST

యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు ఓ ట్రక్కు మీదకు దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు ఓ ట్రక్కు మీదకు దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందగా పలువురికి గాయాలయ్యాయి.
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. తమ వారు మృతి చెందారని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

యుమున ఎక్స్ ప్రెస్ హైవేపై మార్చి 29వ తేదీ శుక్రవారం ఓ డబుల్ డెక్కర్ బస్సు వస్తోంది. ఈ బస్సులో ప్రయాణీకులతో కిక్కిరిసిపోయి ఉంది. రబుపురాథానా ఏరియా దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న ట్రక్కు మీదకు దూసుకెళ్లింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 31 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష