Bollywood Actress : బాలీవుడ్ నటిపై వేధింపులు.. యూట్యూబర్‌పై కేసు నమోదు

సోషల్ మీడియాలో తనను ఓ యూట్యూబర్‌ వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదుచేసింది. దాంతో ఢిల్లీ పోలీసులు సదరు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు.

Bollywood Actress : బాలీవుడ్ నటిపై వేధింపులు.. యూట్యూబర్‌పై కేసు నమోదు

Case Filed Against Youtuber For Harassing Bollywood Actress

Updated On : October 11, 2021 / 8:14 AM IST

Bollywood Actress : సోషల్ మీడియాలో బాలీవుడ్ నటికి పరిచయం అయ్యాడు. నీ ఫ్యాన్ అంటూ ట్వీట్ కలిపాడు. ప్రతిరోజూ వరుస ట్వీట్లతో ఆమెను ఇబ్బందిపెట్టడం మొదలుపెట్టాడు. స్పందించకపోవడంతో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధించాడు. అతడి వేధింపులను భరించలేక చివరికి బాధిత నటి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది.
Civilian Killings : భద్రతా దళాల అదుపులో 700మంది ఉగ్రవాద సానుభూతిపరులు

సోషల్ మీడియాలో తనను ఓ యూట్యూబర్‌ వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదుచేసింది. దాంతో ఢిల్లీ పోలీసులు సదరు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. నిందితుడు యూట్యూబర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌లో తన పట్ల అసభ్యకరమైన సందేశాలను పోస్టు చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.

కొన్ని రోజులుగా తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా కొన్ని మూవీ సీన్లతో తన హ్యాష్ ట్యాగ్స్ జోడిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన మెసేజ్‌లను పెడుతున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్ నటి ఫిర్యాదు మేరకు నార్త్ పోలీసు స్టేషన్ వసంత్ కుంజ్ సంబంధిత సెక్షన్ల కింద నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని సౌత్ వెస్ట్ డీసీపీ డిప్యూటీ పోలీసు కమిషనర్ గౌరవ్ శర్మ చెప్పారు.
MAA Elections: ‘మా’ ఎన్నికలు.. విజేతల పూర్తి వివరాలు..!