Bank Cash Theft : బ్యాంకు సొమ్ముతో వ్యాన్ డ్రైవర్ పరారీ
నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు నుండి రూ. 50 లక్షల నగదు ఉన్న వ్యాన్‌తో డ్రైవర్ పరారయ్యాడు.

Icici Bank
Bank Cash Theft : క్యాష్ ఏజెన్సీ నుంచి తెచ్చిన నగదు బ్యాంకులో ఇవ్వకుండా, ఆ నగదుతో వ్యాన్ డ్రైవర్ పారిపోయిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. సెక్యూర్ వ్యాలీ క్యాష్ ఏజెన్సీ లో పోలయ్య అనే వ్యక్తి గత ఏడేళ్లుగా వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం క్యాష్ ఏజెన్సీ నుంచి నగదు తీసుకుని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు వచ్చాడు. అక్కడకు రాగానే బ్యాంకు ఉద్యోగి వ్యాన్ దిగగానే, పోలయ్య వ్యాన్ తో సహా పరారయ్యాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చిన్న బజారు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.