బిజినెస్ లో నష్టం వచ్చిందని..: ICICI బ్యాంకులో ఉద్యోగాలంటూ మోసం

కార్పొరేట్‌ కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 03:16 AM IST
బిజినెస్ లో నష్టం వచ్చిందని..: ICICI బ్యాంకులో ఉద్యోగాలంటూ మోసం

Updated On : April 10, 2019 / 3:16 AM IST

కార్పొరేట్‌ కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్ : కార్పొరేట్‌ కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రెండు కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాకున్నారు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం గొట్లగుంటకి చెందిన తోట ముని సుందర్‌ బాబు అలియాస్‌ బాబు(35) తొమ్మిదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సిద్ధార్థ్‌ స్మార్ట్‌ సొల్యూషన్‌లో చేరాడు.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్

ఏడాది తర్వాత తానే సొంతంగా ఎన్‌లైట్‌ సాఫ్ట్‌ సొల్యూషన్‌ ప్రారంభించాడు. ఏడేళ్ల తర్వాత నష్టాలు రావడంతో 2017లో సంస్థను మూసివేసి స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడా ఆర్థిక ఇబ్బందులు రావటంతో 2018, నవంబరులో హైదరాబాద్‌ వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్‌ థియేటర్‌ సమీపంలో ఇషా సొల్యూషన్‌ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఫేస్‌బుక్‌, క్వికర్‌, ఓఎల్‌ఎక్స్‌, ఇండీడ్‌, ఫ్రెషర్‌ వరల్డ్‌ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చాడు. ప్రముఖ సంస్థలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తెలిపారు. 

నిరుద్యోగులు ముని సుందర్‌ను సంప్రదించేవారు. వారిని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల తీసుకున్నాడు. కొందరు నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. ఐసీఐసీఐ బ్యాంకులకు వాటిని తీసుకెళితే అవి నకిలీవని తేలింది. సుందర్‌ను ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితులకు అతడు కనిపించలేదు. దీంతో బాధితులు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సెంట్రల్ జోన్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు బృందం ముని సుందర్‌ చంపాపేటలో ఉన్నట్టు గుర్తించి ఏప్రిల్ 9 మంగళవారం అదుపులోకి తీసుకుని, సరూర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. అతని నుంచి రెండు కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. ఉద్యోగం రాకపోవటం, ఆర్థిక సమస్యల వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నాడు. నిజాయితీగా ఉద్యోగం అడిగితే ఎవరూ ఇవ్వలేదు.. గత్యంతం లేక నిరుద్యోగుల ఆశలనే పెట్టుబడిగా మోసం చేసినట్లు చెబుతున్నాడు.
Read Also : వీవీ ప్యాట్స్ లెక్కింపు : పొలిటికల్ పార్టీల్లో కొత్త ఆందోళన