Dirty Trick : మహిళా టూరిస్టులను అసభ్యంగా వీడియోలు తీస్తున్న యువకుడు అరెస్ట్

స్కర్ట్ లు ధరించి వచ్చే మహిళా పర్యాటకులను అసభ్యంగా వీడియో తీస్తున్న యువకుడిని రాజస్ధాన్ లోని అమేర్‌కోట లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Dirty Trick : మహిళా టూరిస్టులను అసభ్యంగా వీడియోలు తీస్తున్న యువకుడు అరెస్ట్

Dirty Tricks

Updated On : August 18, 2021 / 4:53 PM IST

Dirty Trick :  స్కర్ట్ లు ధరించి వచ్చే మహిళా పర్యాటకులను అసభ్యంగా వీడియో తీస్తున్న యువకుడిని రాజస్ధాన్ లోని అమేర్‌కోట లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసిద్ధి చెందిన జైపూర్‌లోని అమేర్‌కోట ను దర్శించటానికి దేశ విదేశాలనుంచి పర్యాటకులు వస్తుంటారు. స్కర్టులు ధరించే వచ్చే మహిళా పర్యాటకులను వారికి తెలియకుండా….అసభ్యంగా వీడియోలు తీస్తున్న యువకుడిని స్ధానిక నిర్భయ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

నిందితుడిని సికార్ జిల్లాకు చెందిన సురేష్ కుమార్ యాదవ్ గా పోలీసులు గుర్తించారు. షాకింగ్ విషయం ఏమిటంటే సురేష్ కుమార్ ను పట్టుకున్ను మహిళా పోలీసులు వీడియోలు కూడా అతని ఫోన్‌లో లభ్యం కావటం. అమేర్ కోట ను దర్శించటానికి వచ్చిన సురేష్ కుమార్ తన షూ లేసులు పదే,పదే విప్పటం, కట్టుకోవటం చేయసాగాడు. ఇందుకోసం అతను ఎక్కువ సార్లు కింద కూర్చుంటున్నాడు. మఫ్టీలో ఉన్న నిర్భయ మహిళా పోలీసులు అతడ్ని గమనించారు.

సురేష్ కుమార్ తన వెనుక నుంచి ఎవరైనా స్కర్ట్ ధరించిన మహిళా టూరిస్టు వస్తున్నప్పుడల్లా కింద కూర్చుని షూలేసులు విప్పి కట్టుకుంటున్నాడు. అప్పుడు తన మొబైల్ ఫోన్‌ను నేలపై ఉంచటం చేస్తున్నాడు. ఆ సమయంలో అటువైపుగా నడిచి వెళుతున్న మహిళా టూరిస్టులు ఆ ఫోన్‌ను దాటి వెళ్లటం జరుగుతోంది.

అతని చర్యలను గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోన్‌ను పరిశీలించారు. ఫోన్ చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. ఆ ఫోన్‌లో అనేకమంది మహిళల వ్యక్తిగత భాగాలు రికార్డైన వీడియోలు లభ్యమయ్యాయి. నిందితుడు ఫోన్ కింద పెట్టినప్పుడల్లా వీడియో ఆన్ చేసి ఉంచేవాడు. ఆసమయంలో ఫోన్ దాటి వెళ్లిన మహిళల వీడియోలు రికార్డై ఉన్నాయి.

మౌంట్ ఆబూ యాత్రకు వెళ్లినప్పుడు తనకు ఇలాంటి డర్టీ ఐడియా వచ్చిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అక్కడ పరిచయం అయిన ఇద్దరు వ్యక్తులు మహిళా టూరిస్టుల అసభ్య కరమైన వీడియోలు ఎలా చిత్రీకరించాలో చెప్పారని అప్పటి నుంచి ఇలా చేస్తున్నానని నిందితుడు తెలిపాడు.