Rape Case : బందరు రేప్ కేసు నిందితులు అరెస్ట్

కృష్ణా జిల్లా బందరు మండలం చినకర అగ్రహారం శివారు, పల్లెపాలెం బీచ్ ఒడ్డున ఈనెల 9వ తేదీ జరిగిన రేప్ కేసు నిందితులను మచిలీపట్నం దిశ పోలీసు‌స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Rape Case : బందరు రేప్ కేసు నిందితులు అరెస్ట్

Rape Accused Arrested

Updated On : March 11, 2022 / 9:23 PM IST

Rape Case : కృష్ణా జిల్లా బందరు మండలం చినకర అగ్రహారం శివారు, పల్లెపాలెం బీచ్ ఒడ్డున ఈనెల 9వ తేదీ జరిగిన రేప్ కేసు నిందితులను మచిలీపట్నం దిశ పోలీసు‌స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే మచిలీపట్నానకి చెందిన 19 ఏళ్ల యువతి ఆమె ప్రియుడితో కలిసి ఈనెల 9వ తేదీన పల్లె పాలెం బీచ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆసమయంలో కరగ్రాహారానికి చెందిన పోసిన నాగబాబు, యర్రంశెట్టి మణిదీప్ అనేఇద్దరు అక్కడికి వచ్చారు.

ప్రియుడిని మణిదీప్‌ తాళ్లతో కట్టివేయగా, పోసిన నాగబాబు విద్యార్థినిని బలవంతంగా సమీపంలోని తోటలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం వారిద్దరినీ వదిలేశారు.

జరిగిన సంఘటనను తలచుకుంటూ ప్రేమికులిద్దరూ బాధతో ఆ రోజు  ఇంటికి వెళ్లారు. ప్రేమికులు ఇద్దరు వారి పెద్దలకు చెప్పకుండా గురువారం బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
Also Read : Indian Missile : పాక్ భూభాగంలో పేలిన ఇండియన్ క్షిపణీ.. టెక్నికల్ ప్రాబ్లమ్ అన్న భారత రక్షణ శాఖ
బాధితురాలిని పరీక్షల నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు  దర్యాప్తులో భాగంగా  పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను ఈ రోజు అరెస్ట్ చేశారు.