Janashakthi Naxals : మాజీ జనశక్తి నేత కిడ్నాప్

సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి @ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.

Janashakthi Naxals : మాజీ జనశక్తి నేత కిడ్నాప్

Janashkathi Naxals

Updated On : March 25, 2022 / 10:03 AM IST

Janashakthi Naxals :  సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి @ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. గతంలో యాదన్న జనశక్తి నేతగా పని చేశారు.

ఉద్యమంలోంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణలో భాగంగా పోలీసులే తీసుకువెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా… కొద్ది రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం జరుపుకున్నారు. సుమారు 80 మంది ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిసింది. పార్టీ సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దుల్లోని పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్‌లో 8మంది సాయుధ జనశక్తి నక్సల్స్, 72 మంది సానుభూతిపరులు సమావేశం అయ్యారు.
Also Read : Love Story: 67ఏళ్ల మహిళతో 28ఏళ్ల యువకుడు.. సహజీవనం కోసం పోరాటం
ఈ సమావేశానికి సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డిపెట్, గంభీరావుపేట్, ముస్తాబాద్‌కు చెందిన మాజీలు హాజరయ్యారు. ఈ మీటింగ్ కు హాజరైన మాజీ నేతలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే యాదన్నను తీసుకువెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.