Extra Marital Affair : ఒక అక్రమ సంబంధం..మూడు ప్రాణాలు బలి
ఒక వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడులో జరిగిన ఈఘటనతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Extra Matiral Affair
Extra Marital Affair : ఒక వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడులో జరిగిన ఈఘటనతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చెంగల్పట్టులోని కైలాసనాధర్ ఆలయం వీధిలో నివసించే గోపి(38) భార్య కన్నియమ్మాళ్…. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్(45) తో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
సురేష్ కు పెళ్లై ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లకు ఈవిషయం గోపీకి తెలిసి భార్యను మందలించాడు. అయినా ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. ఈ క్రమంలో గత శుక్రవారం గోపీ, సురేష్ గొడవపడ్డారు. అనంతరం ఇంటికి వచ్చిన గోపీ తన భార్య కన్నియమ్మాళ్ తో గొడవ పడ్డాడు. అయితే శనివారం ఉదయం గోపి అతని భార్య… ఇద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న చెంగల్పట్టు టౌన్ పోలీసులు ఘటనా స్ధలానికివచ్చి మృతదేహాల్ని ప్రభుత్వాసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈఘటనలో ఆటో డ్రైవర్ సురేష్ ను విచారించాలని భావించారు. కాగా వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకున్న సురేష్… పోలీసులు తనను విచారిస్తారని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీ, కన్నియమ్మాళ్ ఆత్మ హత్య చేసుకోవటంతో వారి కూతురు…. సురేష్ ఆత్మహత్య చేసుకోవటంతో అతని భార్య, ముగ్గురు కుమార్తెలు అనాధలయ్యారు.