హరీశ్‌రావుకు తప్పిన ప్రమాదం : ప్రచార వాహనంలో మంటలు

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 03:27 PM IST
హరీశ్‌రావుకు తప్పిన ప్రమాదం : ప్రచార వాహనంలో మంటలు

Updated On : March 29, 2019 / 3:27 PM IST

మెదక్ : ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆయన అర్ధాంతరంగా ప్రసంగాన్ని ఆపి వాహనం నుంచి దిగి వెళ్లిపోయారు.

హరీష్ రావుతోపాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు కూడా వాహనం దిగి దూరంగా వెళ్లారు. ఎలాంటి అపాయం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా గతంలోనూ ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చిన సందర్భంగా హరీశ్‌ రావుకు ప్రమాదం తప్పిన విషయం విదితమే.