Jubilee hills : FMS ఆస్పత్రి సిబ్బంది చేతివాటం.. పేషెంట్ నుంచి రూ.50లక్షల విలువైన వజ్రాల ఉంగరం చోరీ..

రూ.50లక్షల విలువు చేసే వజ్రాల ఉంగరాన్ని ఓ మహిళా పేషెంట్ నుంచి ఆస్పత్రి సిబ్బంది కొట్టేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Jubilee hills : FMS ఆస్పత్రి సిబ్బంది చేతివాటం.. పేషెంట్ నుంచి రూ.50లక్షల విలువైన వజ్రాల ఉంగరం చోరీ..

jubilee hills fms hospitaldiamond ring

Updated On : July 3, 2023 / 4:20 PM IST

Jubilee hills – diamond ring : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న FMS ఆస్పత్రి సిబ్బంది చేతివాటం బయటపడింది. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ నుంచి వజ్రాల ఉంగరాన్ని చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.50లక్షల విలువు చేసే వజ్రాల ఉంగరాన్ని ఓ మహిళా పేషెంట్ నుంచి కొట్టేశారు. తన ఉంగరం పోయిందని ఆస్పత్రి సిబ్బందిని అడిగారు సదరు మహిళ. కానీ వారు మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్పారు. దీంతో ఆమె గట్టిగా నిలదీసింది. కానీ వారు దురుసుగా సమాధానం చెప్పటంతో బాధిత మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రికి వచ్చి ఎంక్వయిరీ చేశారు. దీంతో అసలు విషయం బటయపడింది. ఓ మహిళా సిబ్బంది ఆ ఉంగరాన్ని చోరీ చేసినట్లుగా బయటపడింది.

uttar pradesh : ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసి జేబులో వేసుకెళ్లిపోయిన భర్త

చర్మ సమస్యలతో ఇబ్బంది పడిని ఓ మహిళ జూన్ 27న జూబ్లీహిల్స్ లోని FMS ఆస్పత్రికి వచ్చింది. చికిత్స సమయంలో చేతికి ఉన్న రూ. 50 లక్షల విలువైన వజ్రపుటుంగరాన్ని పక్కన పెట్టారు. తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు. తరువాత ఆ విషయం గుర్తుకొచ్చి హడావిడిగా తిరిగి ఆస్పత్రికి వచ్చి విషయం చెప్పి తన ఉంగరం ఇచ్చేయాలని కోరారు. దానికి వారు ఎవ్వరు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె గట్టిగా నిలదీసింది. కానీ ఫలితం లేకపోగా వారు దురుసుగా సమాధానం చెప్పటంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వజ్రాల ఉంగరం విలువ రూ.50లక్షలు విలువ ఉంటుందని చెప్పింది.

ISKP Terror Organization : ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు

దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బందిలో ఓ యువతిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టిష్యూ పేపర్‌లో చుట్టిన ఉంగరాన్ని తన పర్సులో ఎవరో పెట్టారని, తాను భయంతో దానిని టాయిలెట్ కమోడ్‌లో విసిరేశానని తెలిపింది. దీంతో టాయిలెట్ కమోడ్, పైపులైన్లను తొలగించి గాలించగా ఉంగరం దొరికింది. సదరు యువతిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు.