ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

  • Published By: veegamteam ,Published On : March 1, 2019 / 01:32 PM IST
ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

Updated On : March 1, 2019 / 1:32 PM IST

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా ఉగ్రదాడి మరువకముందే మళ్లీ విరుచుకుపడ్డారు. జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 9 మంది జవాన్లకు గాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్లను హంద్వారా ఆస్పత్రికి తరలించారు. సీఆర్ పీఎఫ్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసు నసీర్ అహ్మద్, మరో ఇద్దరు జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
Read Also : వెల్‌కమ్ అభినందన్, అప్పుడే అయిపోయిందనుకోవద్దు