లాక్ డౌన్ లోనూ ఘోరాలు, హైదరాబాద్ లో బాలికపై గ్యాంగ్ రేప్
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా హైదరాబాద్‌లో చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకు

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా హైదరాబాద్‌లో చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని ఏరియాల్లో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. హైదరాబాద్ లో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. తాగాజా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని బాలిక(14)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కుత్బుల్లాపూర్‌లోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక ఏప్రిల్ 20న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం రోడా మేస్త్రీనగర్‌లో నడుకుచుంటూ వెళ్తున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన అక్బర్, జుమన్, గయాజ్, అలీం అనే యువకులు సమీపంలోని ఓ పాడుపడిన భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులు బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడించారు.
దీంతో వారు వెంటనే దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా రెండు గంటల తర్వాత బాధితురాలు దేవేందర్‌నగర్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తిని పట్టుకోగా మిగిలిన ముగ్గురు పరారయ్యారు. కాసేపటికే పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.